Saturday, April 13, 2019

ఆబ్జెక్టివ్‌ ఇండియన్‌ ఎకనామి


ఆబ్జెక్టివ్‌ ఇండియన్‌ ఎకనామి డియర్‌ రీడర్స్‌, ఇటీవల జరిగిన పరీక్షలను గమనిస్తే, ఎక్కువగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్ల నుండి ప్రశ్నలను అడగటాన్ని గమనించవచ్చు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, వినూత్నంగా ఎకనామీకి సంబంధించి తాజా సమాచారం నుండే ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి, వెబ్‌సైట్లు, డైలీ న్యూస్‌పేపర్లు, అధికారిక డాక్యుమెంట్లు, ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను ప్రిపేరయ్యే వారే పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అందువల్ల, మేము కూడా తాజా ప్రభుత్వ డాక్యుమెంట్లు, నివేదికలు, ఇయర్‌ బుక్‌ ఆధారంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా, నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నవ భారతదేశం 75 డాక్యుమెంటు నుండి 380కు పైగా ప్రశ్నలు, కేంద్ర ప్రభుత్వ పబ్లికేషన్‌ డివిజన్‌ విడుదల చేసిన ఇండియా ఇయర్‌ బుక్‌ నుండి 299 ప్రశ్నలు, వ్యవసాయ గణన (అగ్రికల్చర్‌ సెన్సస్‌ 2015-16), నాబార్డు విడుదల చేసిన గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే 2016-17, ప్రభుత్వ నూతన పథకాలు, గ్రామీణాభివృద్ధి పథకాలు, జిఎస్‌టి, ఇంకా తెలుగు అకాడమీ ఇండియన్‌ ఎకానమీ పుస్తకాల నుండి 3500కు పైగా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను మీ కోసం రూపొంచడం జరిగింది. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుస్తకం నుండి ప్రశ్నలు పరీక్షలలో తప్పకుండా వస్తాయని భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ముఖ్యమైన అన్ని డాక్యుమెంట్ల నుండి ప్రశ్నలను తయారు చేయడం జరిగింది.