Saturday, July 30, 2016

తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర అవతరణ



తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షలకు రాష్ట్ర చరిత్ర, ఉద్యమం, రాష్ట్ర అవతరణ అంశం ఎంతో ముఖ్యమైనది. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ చరిత్రను సంక్షిప్తంగా ఈ పుస్తకంలో ప్రశ్నలు - జవాబులు రూపంలో సంక్షిప్తంగా అందించడం జరిగింది.  తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర అవతరణ పుస్తకం ఆధారంగా ఇందులోని ప్రశ్నలను సంకలనం చేయడం జరిగింది. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే గ్రూపు -2 పరీక్షలో ఈ అంశాన్ని నాలుగవ పేపరుగా ఎంపిక చేశారు. దీనితో పాటు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించే ఎస్‌ఐ పరీక్షల్లో కూడా దీనిని ఒక ప్రధాన అంశంగా చేర్చారు. అయితే, రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో ఈ సబ్జెక్టు నుండి ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి, అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అంశాన్ని ప్రిపేర్‌ కావలసి ఉంటుంది.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పరీక్షలకు విద్యార్థులు వీలైనంత సులభంగా ప్రిపేర్‌ అయ్యే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. మా ఇతర ప్రచురణల లాగానే ఈ పుస్తకం కూడా పరీక్షల్లో విజయం సాధించడానికి మీకు మరింతగా ఉపకరిస్తుందని ఆశిస్తూ...

విషయ సూచిక

1. పరిచయం - చారిత్రక నేపథ్యం 5 - 21

2. సాలార్‌జంగ్‌ సంస్కరణలు 22 - 28

3. తెలంగాణలో రాజకీయేతర సంస్థలు 29  - 42

4. నిజాం రాష్ట్రంలో జాతీయోద్యమం 43 - 48

5. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 49 - 51

6. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ రాష్ట్రం 52 - 57

7. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ - ప్రక్రియ 58 - 64

8. తెలంగాణ ప్రాంతీయ కమిటీ 65 - 67

9. తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు 68 - 73

10. తెలంగాణ ఉద్యమం (1968-72) 74 - 79

11. 1972 తదనంతర పరిణామాలు 80 - 90

12. నక్సల్బరీ ఉద్యమం - సామాజిక ఆర్థిక నేపథ్యం 91 - 96

13. తెలుగు జాతీయత - తెలంగాణ అస్తిత్వం 97 - 102

14. సరళీకృత ఆర్థిక విధానాలు 103 - 110

15. తెలంగాణ మలిదశ ఉద్యమం 111 - 127

16. టి.ఆర్‌.ఎస్‌ పార్టీ ఆవిర్భావం - రాజకీయ పునరేకీకరణ 128 - 134

17. తెలంగాణ రాష్ట్ర మహోద్యమం 135 - 146

18. ప్రజా ఉద్యమాలు - నిరసన రూపాలు 147 - 159

19. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 160 - 164

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ముఖ్యాంశాలు 165 - 177

20. తెలంగాణ పునర్నిర్మాణం - సవాళ్లు 175 - 184

Sunday, July 24, 2016

General Essay for Group 1 Mains

These essays are published in 2011. If you feel these essays are helpful you can download from the link given below.
https://drive.google.com/file/d/0B1mSnpBkzmM5ZXlEQ1NvTFpUaHc/view?ths=true

Tuesday, July 12, 2016

స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల నిర్వహణ అకౌంటింగ్‌, పథకాల నిధుల ఖర్చు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(ఎపిపిఎస్‌సి) నిర్వహించే పంచాయతీ సెక్రటరీ పరీక్షలలో పేపర్‌ -2లో స్థానిక సంస్థల రాబడి, వ్యయాల నిర్వహణ, అకౌంటింగ్‌, వివిధ పథకాల కింద లభ్యమయ్యే నిధుల పాలన అనే అంశాన్ని కొత్తగా సిలబస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. 2014 ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలలో అకౌంటింగ్‌ విభాగం నుండి 27 ప్రశ్నలు అడిగారు. పంచాయతీ కార్యదర్శి విధులలో గ్రామ పంచాయతీ అకౌంట్ల నిర్వహణ కూడా ఉంటుంది. అందువల్ల ఉద్యోగంలో చేరే వారికి అకౌంటింగ్‌లో కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే పేపర్‌లో అకౌంటింగ్‌ను చేర్చడం జరిగింది.

ముఖ్యంగా అకౌంటింగ్‌ అర్థం, నిర్వచనం, అకౌంటింగ్‌ ప్రక్రియ, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌, సహాయక పుస్తకాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ, ముగింపు లెక్కలు, అకౌంటింగ్‌, తప్పులు - సవరణ, కన్‌సైన్‌మెంట్‌ ఖాతాలు, వ్యాపార, వ్యాపారేతర భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపార ఖాతాలు, కంపెనీలు, తరుగుదల, ఏర్పాట్లు, రిజర్వులు  మొదలగు భాగాలను ప్రిపేరయితే మార్కులు సంపాదించుకోవచ్చు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామానికి వచ్చే ఆదాయాలు, వ్యయాల గురించి, వివిధ ప్రభుత్వ పథకాల నిధుల గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకనుగుణంగా ఈ పుస్తకాన్ని సమగ్రంగా రూపొందించడం జరిగింది. గత ఎగ్జామ్‌లో కూడా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగిపడిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అవగాహన కోసం ఎపిపిఎస్‌సి నిర్వహించిన 2014లో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ పరీక్షలో అకౌంటింగ్‌ విభాగం నుండి వచ్చిన ప్రశ్నలను,  జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ అకౌంటంట్‌, 2003 గ్రూప్‌-2 బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం జరిపిన పరీక్షలలో అకౌంటింగ్‌ పేపర్‌ పరీక్షలలో అకౌంటింగ్‌ ప్రాథమిక అంశాలపై అడిగిన ప్రశ్నలను సమాధానాలతో సహా పుస్తకం మొదట్లో ఇవ్వడం జరిగింది.  మా గత పుస్తకాల వలే ఈ పుస్తకం కూడా మీ విజయానికి పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తూ........