Tuesday, July 12, 2016

స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల నిర్వహణ అకౌంటింగ్‌, పథకాల నిధుల ఖర్చు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(ఎపిపిఎస్‌సి) నిర్వహించే పంచాయతీ సెక్రటరీ పరీక్షలలో పేపర్‌ -2లో స్థానిక సంస్థల రాబడి, వ్యయాల నిర్వహణ, అకౌంటింగ్‌, వివిధ పథకాల కింద లభ్యమయ్యే నిధుల పాలన అనే అంశాన్ని కొత్తగా సిలబస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. 2014 ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలలో అకౌంటింగ్‌ విభాగం నుండి 27 ప్రశ్నలు అడిగారు. పంచాయతీ కార్యదర్శి విధులలో గ్రామ పంచాయతీ అకౌంట్ల నిర్వహణ కూడా ఉంటుంది. అందువల్ల ఉద్యోగంలో చేరే వారికి అకౌంటింగ్‌లో కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే పేపర్‌లో అకౌంటింగ్‌ను చేర్చడం జరిగింది.

ముఖ్యంగా అకౌంటింగ్‌ అర్థం, నిర్వచనం, అకౌంటింగ్‌ ప్రక్రియ, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌, సహాయక పుస్తకాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ, ముగింపు లెక్కలు, అకౌంటింగ్‌, తప్పులు - సవరణ, కన్‌సైన్‌మెంట్‌ ఖాతాలు, వ్యాపార, వ్యాపారేతర భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపార ఖాతాలు, కంపెనీలు, తరుగుదల, ఏర్పాట్లు, రిజర్వులు  మొదలగు భాగాలను ప్రిపేరయితే మార్కులు సంపాదించుకోవచ్చు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామానికి వచ్చే ఆదాయాలు, వ్యయాల గురించి, వివిధ ప్రభుత్వ పథకాల నిధుల గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకనుగుణంగా ఈ పుస్తకాన్ని సమగ్రంగా రూపొందించడం జరిగింది. గత ఎగ్జామ్‌లో కూడా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగిపడిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అవగాహన కోసం ఎపిపిఎస్‌సి నిర్వహించిన 2014లో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ పరీక్షలో అకౌంటింగ్‌ విభాగం నుండి వచ్చిన ప్రశ్నలను,  జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ అకౌంటంట్‌, 2003 గ్రూప్‌-2 బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం జరిపిన పరీక్షలలో అకౌంటింగ్‌ పేపర్‌ పరీక్షలలో అకౌంటింగ్‌ ప్రాథమిక అంశాలపై అడిగిన ప్రశ్నలను సమాధానాలతో సహా పుస్తకం మొదట్లో ఇవ్వడం జరిగింది.  మా గత పుస్తకాల వలే ఈ పుస్తకం కూడా మీ విజయానికి పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తూ........

1 comment:

  1. Sir I want this copy . I don't forget your help. A I am fan of your publication.

    ReplyDelete