Wednesday, January 25, 2017

గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నలు


ఏపీపీఎస్సీ గ్రూప్-1 (2011 నోటిఫికేషన్) మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఇటీవల కమిషన్ ప్రకటించింది. ఈ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 2017 ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2013 జనవరి 28 నుంచి మార్చి 21 వరకు జరిగిన గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలు ఇక్కడ అందిస్తున్నాం. ప్రస్తుతం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్న అభ్యర్థులు వీటిని అధ్యయనం చేసి ప్రశ్నల సరళిపై ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు.
2013 మార్చి 21న
* ఇజ్రాయెల్, అమెరికా రిలేషన్స్ గురించి చెప్పండి.
* మామిడి పండ్ల రకాలను తెలపండి.
* ఎథికల్ హాకింగ్ గురించి చెప్పండి.
* విజయనగర సామ్రాజ్యంలోని అష్టదిగ్గజాల గురించి చెప్పండి.
* What is meant by "Marketing"?
* ఫిలిప్ కోట్లర్ ఎవరు? ఆయన ఏ దేశానికి చెందినవారు?
* మైక్రోబయాలజీ ప్రాముఖ్యం ఏమిటి? దాన్ని ఏయే రంగాల్లో ఉపయోగిస్తారు?
* ఆల్కహాల్ తయారీలో దేన్ని ఉపయోగిస్తారు?
* పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పండి. దానికి సంబంధించి ఒక ఉదాహరణ తెలపండి.
* మీకు తెలిసిన ఏదైనా బ్యాక్టీరియా గురించి చెప్పండి.
* మహాత్మా జ్యోతి బాపులే సతీమణి ఎవరు? ఆమె చేసిన సేవలేమిటి?
* అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడానికి కారణాలేమిటి?
* బుద్ధిజంలోని అష్టాంగాల గురించి చెప్పండి.
* ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలను తెలపండి.
* 1857 తిరుగుబాటు వల్ల కలిగిన ప్రయోజనాలేమిటి?
* బ్రిటిష్ పాలన వల్ల కలిగిన లాభ, నష్టాల గురించి తెలపండి.
* బ్రిటిష్ పాలన వల్ల భారతీయ సంస్కృతికి నష్టం కలిగిందని భావిస్తున్నారా?
* స్వతంత్య్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు?
* UGC అబ్రివేషన్ చెప్పండి.
* AICTE అబ్రివేషన్ చెప్పండి.
* ఈ రోజు దినపత్రికల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూలు గురించి ఇచ్చారు? ఆ రాష్ట్రం ఏది? ఆ రాష్ట్రంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
* పీరియాడిక్ టేబుల్‌లో ఎన్ని మూలకాలున్నాయి? అవి ఏవి?
* జడవాయువులు అంటే ఏమిటి? వాటికి ఒక ఉదాహరణ చెప్పండి.
* ఆర్సెనిక్ మెటల్ గురించి చెప్పండి.
* టెలివిజన్, వార్తా పత్రికలకు రేటింగ్స్ ఎవరు ఇస్తారు?
* పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీకి తేడా ఏమిటి?
* పీఎస్ఎల్‌వీ-సీ20 గురించి చెప్పండి.
* ఉపగ్రహం ఉపయోగాలను తెలపండి.
* జీ20లోని ఏయే దేశాలు తమ ఉపగ్రహాలను పంపించాయి?
* ఉత్తమ ఉపాధ్యాయుడి లక్షణాలు తెలపండి.
* నక్సలిజానికి కారణాలను తెలపండి.
* మైక్రో ఫైనాన్స్ బంగ్లాదేశ్‌లో ఎందుకు తక్కువైంది? ఇండియాలో ఎందుకు వైఫల్యం చెందింది?
* నానో ఫైనాన్సింగ్ అంటే ఏమిటి?
* 400 C విలువను ఫారన్‌హీట్, కెల్విన్ మానాల్లో తెలపండి.
2013 మార్చి 20న
* రీ ఎల‌క్షన్స్‌, బై ఎల‌క్షన్స్ గురించి చెప్పండి.
* రెవెన్యూ లోటు, విత్తలోటు గురించి చెప్పండి
* డిస్కవ‌రీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవ‌రు రాశారు? ఎందుకు రాశారు?
* న‌ల్గొండ జిల్లాలో క‌మ్యూనిస్టుల ప్రాబ‌ల్యం ఎందుకు త‌గ్గింది?
* ప‌త్తి క్వింటాలు ధ‌ర ఎంత‌?
* మిలీనియం డెవ‌ల‌ప్‌మెంట్ గోల్స్ గురించి చెప్పండి.
* మ‌హార‌త్న కంపెనీల గురించి చెప్పండి.
* యూఎస్ఎస్ఆర్ ఎందుకు వైఫ‌ల్యం చెందింది?
* కానిస్టిట్యూష‌న‌ల్ బాడీస్ గురించి చెప్పండి.
* మైనింగ్ ఇంజినీరింగ్ గురించి చెప్పండి.
* మ‌హ‌మ్మద్ గ‌జినీ గురించి చెప్పండి.
2013 మార్చి 19న
* బాబ్లీ ప్రాజెక్టు సమస్య ఏమిటి?
* మైక్రో ఇరిగేషన్ అంటే ఏమిటి? దాన్ని ఎక్కడ మొదలుపెట్టారు?
* ఫెడరేషన్, కాన్ఫేడరేషన్ అంటే ఏమిటి? వాటి మధ్య తేడా ఏమిటి?
* త్రికోణమితి గురించి తెలుసా? Sin30, Sin(a+b) చెప్పండి. Sin15 విలువ కనుక్కోండి.
* పీఆర్‌సీ అంటే ఏమిటి? దాని గురించి చెప్పండి.
* ఇంగ్లిష్ లిటరేచర్‌కి సంబంధించిన ఇండియన్ రచయితల గురించి చెప్పండి.
* మార్క్సిజం గురించి చెప్పండి.
* ఫాసిజం గురించి చెప్పండి.
* ఇన్‌ఫ్లేషన్, డిఫ్లేషన్, స్టాఫ్లేషన్ అంటే ఏమిటి?
* డీఏ దేని ఆధారంగా ఇస్తారు?
* మీ అభిమాన నాయకుడు ఎవరు?.... మహాత్మాగాంధీని మీరు ఎందుకు ఇష్టపడతారు?
* ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ మధ్య తేడా ఏమిటి? వాటి లాభ, నష్టాలను తెలపండి.
* మాలీ సంక్షోభం గురించి తెలపండి.
* లాస్ ఆఫ్ థెర్మో డైనమిక్స్ గురించి చెప్పండి.
* మీ జిల్లాలోని ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పండి.
* హంద్రీనీవా ప్రాజెక్టు గురించి చెప్పండి.
* ఒలింపిక్స్ నుంచి తొలగించిన గేమ్స్ ఏవి? ఎందుకు తొలగించారు?
* మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చెప్పండి.
* బ్రిక్స్ (BRICS) గురించి చెప్పండి.
* కాశ్మీరు సమస్య గురించి చెప్పండి.
* పీవీ నరసింహారావు చేసిన కంట్రిబ్యూషన్ గురించి చెప్పండి. అది దేశానికి ఎంతవరకు అవసరం?
* మతం అంటే ఏమిటి? హిందూ మతానికి, ఇతర మతాలకు తేడా చెప్పండి.
2013 మార్చి 18న
* Pali Conference గురించి చెప్పండి.
* Tidal Energy ని ఏయే ప్రదేశాల్లో గుర్తిస్తున్నారు?
* ఉరిశిక్ష అమలు చేయడం సబబేనా?
* 'స్వర్ణ చతుర్భుజి'ని ఏ నేపథ్యంలో ఏర్పాటు చేశారు? దాని పూర్వాపరాలు ఏమిటి?
* కాంతి కిరణాలతో సమానమైన కిరణాలేవి? వాటి వేగంతో సమానమైన కిరణాలు ఏమిటి?
* ఆల్ఫా, బీటా, గామా కిరణాలకు తేడా ఏమిటి?
* 'హిగ్స్ బోసాన్' కణం గురించి చెప్పండి?
* అసైన్డ్‌మెంట్, అలైన్‌మెంట్ భూములు అంటే ఏమిటి?
* 1984లో పంజాబ్‌లో జరిగిన వివాదాలు, అల్లర్ల గురించి చెప్పండి.
* ఛార్లెస్, బాయిల్ నియమాల గురించి చెప్పండి.
* అల్యూమినియం ఆక్సైడ్ ఫార్ములా ఏమిటి?
* Difference between Finance and PRC commission
* Write Retention గురించి చెప్పండి.
* అష్టదిగ్గజాల గురించి చెప్పండి.
* భారతీయ నృత్యాల గురించి చెప్పండి.
* భారతీయ సంగీత దర్శకుల గురించి తెలపండి.
* Direct Benefit Transfer గురించి చెప్పండి.
* శ్రీలంకలో జరుగుతున్న పరిణామాల గురించి చెప్పండి
* న్యూస్‌పేపర్‌లోని రెండు హెడ్‌లైన్స్ చెప్పండి.
* 'కొపెన్ హెగెన్' గురించి చెప్పండి.
* మయన్మార్ సంక్షోభం ఏమిటి?
* నేపాల్‌లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి?
* 'అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి? దానికి దారితీసే కారణాలేమిటి?
2013 మార్చి 16న
* 'జీరో అవర్' అంటే ఏమిటి?
* నక్షత్రం గుర్తు ఉన్న ప్రశ్నలకు, నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు తేడా ఏమిటి?
* ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారు?
* పీఎస్ఎల్‌వీ గురించి చెప్పండి.
* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత?
* యూపీఎస్సీ సంస్కరణల గురించి చెప్పండి.
* మొక్కలు కేవలం నీటిని ఆహారంగా తీసుకుని జీవిస్తాయి కదా? మనుషులు మాత్రం మొక్కలు, నీరు రెండింటినీ ఆహారంగా తీసుకుంటున్నారు. ఎందుకు?
* అఫ్జల్‌గురు గురించి చెప్పండి.
* భారత్, పాకిస్థాన్ రెండూ కలిసి ఉంటే ఎలా ఉంటుంది?
* రాజ్యసభ గురించి చెప్పండి.
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి?
* రాజీవ్‌గాంధీ, ఎన్టీయార్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి చెప్పండి.
* శ్రీనివాస రామానుజన్ గురించి చెప్పండి.
* 'సున్నా'ను ఎవరు కనుక్కున్నారు?
2013 మార్చి 15న
* బడ్జెట్ ఎలా తయారుచేస్తారు?
* నీకు నచ్చిన జాతీయ నాయకుడి గురించి చెప్పండి.
* నీకు నచ్చిన ఇద్దరు సైకాలజిస్టుల గురించి చెప్పండి.
* సంకీర్ణ ప్రభుత్వాల పాత్ర ఏమిటి?
* చంద్రయాన్ గురించి చెప్పండి.
* 'మధుమలై' పార్కు ప్రత్యేకత ఏమిటి?
* 'ఓలమ్ లి' గ్రానైట్ గురించి చెప్పండి.
* వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గురించి చెప్పండి.
* చిన్న రాష్ట్రాల వల్ల లాభాలేంటి? ఇబ్బందులు ఏమిటి?
* 'పలాయన వేగం' అంటే ఏమిటి?
* తుగ్లక్ గురించి చెప్పండి.
* జీవ వైవిధ్యం అంటే ఏమిటి? దాని అవసరం ఏమిటి?
* గుడ్ గవర్నెన్స్ అంటే ఏమిటి? సిటిజన్ చార్టర్‌కు, గుడ్ గవర్నెన్స్‌కు తేడా ఏమిటి?
* సిటిజన్ చార్టర్ గురించి సభలో జరుగుతున్న చర్చలు ఏమిటి?
* నక్సలిజం అంతరించిపోవడానికి కారణాలు ఏమిటి?
* మీ మండలం విస్తీర్ణం, జనాభా ఎంత?
* మీ మండలంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు?
* డీఎన్ఏకు, ఆర్ఎన్ఏకు తేడాలు ఏమిటి?
* నియోసిస్‌లో క్రోమోజోమ్‌లు ఎందుకు తగ్గిపోతాయి?
* వ్యాట్, జీడీపీ రేషియో గురించి చెప్పండి.
* ఫ్యాక్షనిజం గురించి చెప్పండి.
2013 మార్చి 14న
* మనీ లాండరింగ్ అంటే ఏమిటి?
* ఎకనమిక్ అఫెన్సెస్ అంటే ఏమిటి?
* రెవెన్యూ సదస్సుల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి చెప్పండి.
* ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి చెప్పండి.
* లీడర్‌షిప్ క్వాలిటీస్ గురించి చెప్పండి.
* టైప్స్ ఆఫ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ గురించి చెప్పండి.
* వాట్ ఆర్ ద లీడర్‌షిప్ క్వాలిటీస్ ఆఫ్ డాక్టర్ వై.ఎస్.ఆర్.?
* ఉమెన్ ఎంపవర్‌మెంట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పండి.
* విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటోంది?
* న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి?
* టైడల్ ఎనర్జీ గురించి చెప్పండి.
* నిర్భయ ఇష్యూ గురించి చెప్పండి.
* ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులు, పరిశ్రమల గురించి చెప్పండి.
* అన్నా హజారే గురించి చెప్పండి.
* మైక్రో బయాలజీ ప్రాముఖ్యాన్ని చెప్పండి.
* నగదు బదిలీ పథకం ముఖ్య ఉద్దేశమేమిటి?
* మూసీ నదిలో చిన్న చిన్న మొక్కలు పెరుగుతున్నాయి కదా! వాటిని తొలగించాలా? వద్దా?
* బయోడైవర్సిటీ గురించి చెప్పండి.
* బుద్ధుడి జీవితకాలంలోని ప్రధాన సంఘటనల గురించి వివరించండి.
* పీఎస్ఎల్‌వీ-సీ20 గురించి చెప్పండి.
* నేపాల్, మయన్మార్ సంఘటనల గురించి చెప్పండి.
* పంచాయతీ ఎన్నికల ఇష్యూ గురించి చెప్పండి.
* మన్మోహన్‌సింగ్ నాయకత్వం గురించి చెప్పండి.
* ల్యాండ్ అసైన్‌మెంట్ గురించి చెప్పండి.
* పోరంబోక్ అంటే ఏమిటి?
* వాట్ ఈజ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ పోరంబోక్?
* టర్నింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్‌టూ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి చెప్పండి.
* అట్రాక్షన్ టర్న్‌డ్ ఎకనమిక్ అఫెన్స్ అంటే ఏమిట
2013 మార్చి 13న
* మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడానికి కారణమేమిటి?
* దేశంలోని ప్రస్తుత మహిళా ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి.
* ఏదైనా ఐడియల్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చెప్పండి.
* రాజ్యాంగ పీఠిక గురించి చెప్పండి.
* సామ్యవాదం, లౌకికవాదం, గణతంత్రం అంటే ఏమిటో వివరించండి.
* ప్రజాస్వామ్యం భారతదేశంలో విజయవంతం అయినట్లుగా పాకిస్థాన్‌లో ఎందుకు కావడం లేదు?
* పాకిస్థాన్ ఇష్యూ గురించి చెప్పండి.
* కాశ్మీర్‌లో ఉన్న ఫండమెంటలిజం దేశవ్యాప్తంగా పెరుగుతోందా?
* బై-ఎలక్షన్స్, రీ-ఎలక్షన్స్, మిడ్‌టెర్మ్ ఎలక్షన్స్ మధ్య తేడా తెలపండి.
* యూనివర్సల్ ఓటు అంటే ఏమిటి?
* ఓటు హక్కు గురించి అంబేద్కర్‌కు, ఇతర సభ్యులకు చర్చ జరిగింది కదా! ఎలాంటి చర్చ జరిగింది?
* లోక్‌పాల్ సెలక్షన్స్ కోసం ఎలక్షన్స్ ఎందుకు జరగడం లేదు?
* ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ ఫంక్షన్స్, డ్యూటీస్ తెలపండి. వాటి మధ్య తేడా చెప్పండి.
* మిస్సైల్ ఉమెన్ ఎవరు? ఆమె గురించి మీకు తెలిసింది చెప్పండి.
* చైనా, ఇండియా మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?
* వార్షిక ప్రణాళికలు ఎలాంటి సందర్భంలో వస్తాయి?
* రాజ్యాంగపరమైన, చట్టపరమైన సంస్థల గురించి తెలపండి.
* ఆరో షెడ్యూల్ గురించి చెప్పండి.
* మీ జిల్లాలో ఎన్ని మండలాలున్నాయి?
* షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మండలాలెన్ని?
* గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏమిటి?
* గోల్డెన్ క్వాడ్రలేటరల్ అంటే ఏమిటి?
* ఈస్ట్-వెస్ట్ కారిడార్ అంటే ఏమిటి?
* నార్త్-సౌత్ కారిడార్ అంటే ఏమిటి?
* లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి చెప్పండి.
* జియో స్టేషనరీ శాటిలైట్ సిస్టమ్ అంటే ఏమిటి?
* అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌కు మధ్య తేడా తెలపండి.
* అసెంబ్లీ సమావేశాలను తక్కువ సమయంలో జరపడానికి కారణం ఏమిటి?
* విశ్వాస, అవిశ్వాస తీర్మానాల మధ్య తేడా ఏమిటి?
* దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పండి.
* మనరాష్ట్రంలోని నృత్యాల గురించి చెప్పండి.
2013 మార్చి 12న
* నక్సలిజం, టెర్రరిజం, ఫ్యాక్షనిజం, వెస్టిమిజం... వీటి మధ్య తేడా తెలపండి.
* గాంధీజీ చంపారన్ ఉద్యమం గురించి తెలపండి.
* ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు?
* సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పండి.
* మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ గురించి చెప్పండి.
* భారత్‌లో రిఫైనరీలు ఎన్ని ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?
* కంభం చెరువు గురించి చెప్పండి.
* వెలిగొండ ప్రాజెక్టు గురించి చెప్పండి.
* గిద్దలూరు ఎమ్మెల్యే పాదయాత్ర చేయడానికి కారణమేమిటి?
* ఎంపీటీసీ గురించి తెలపండి.
* నదుల అనుసంధానం వల్ల లాభ, నష్టాలను తెలపండి.
* సత్యం రామలింగరాజు గురించి చెప్పండి.
* బంగ్లాదేశ్ ఇష్యూ గురించి చెప్పండి.
* ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో గొడవలకు కారణం ఏమిటి?
* నవ్వు పుట్టించే వాయువు రసాయన నామం ఏమిటి?
* జీరో వ్యాల్యూ అసెట్స్ అంటే ఏమిటి?
* జేఎన్ఎన్‌యూఆర్ఎం అంటే ఏమిటి? పుర అంటే ఏమిటి? రెండింటికీ మధ్య తేడా ఏమిటి?
* రాష్ట్ర శాసనసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
* రాష్ట్ర శాసనమండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
* చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
* మీరు ఒక అధికారిగా హెల్త్ మినిస్టర్‌ను కలిస్తే, ఏం అడుగుతారు?
* ప్లానింగ్ కమిషన్ గురించి చెప్పండి. దాని అవసరం ఏమిటి?
* ఇండియన్ మిల్ట్రీలో మహిళలు ఎందుకు లేరు?
* ధ్రుతరాష్ట్రుడి అన్న ఎవరు?
* శాసనసభలో ఎంతమందిని నామినేట్ చేస్తారు?
* శాసనసభ, శాసనమండలి అద్యక్షుల పేర్లు తెలపండి.
2013 మార్చి 8న
* కమ్యూనికేషన్ ఫండమెంటలిజం గురించి చెప్పండి. ఇది జాతీయ సమగ్రతపై ఏమైనా ప్రభావం చూపుతోందా?
* చావెజ్ గురించి చెప్పండి. ఆయన స్థాపించిన పార్టీ పేరేమిటి? అతడిని ప్రజలు అంతగా ఎందుకు అభిమానిస్తున్నారు? ఆయన చేసిన రీఫార్మ్స్ ఏమిటి?
* గ్రీకు ప్రాచీన తత్త్వవేత్తల గురించి చెప్పండి.
* స్ట్రాటో గురించి చెప్పండి.
* రూసోకు ఫ్రెంచి విప్లవానికి సంబంధం ఏమిటి?
* ఛైల్డ్ లేబర్ యాక్ట్ గురించి చెప్పండి.
* కుతుబ్‌షాహీ వంశస్థుల గురించి చెప్పండి. వారు చేపట్టిన నిర్మాణాల గురించి తెలపండి.
* క్రిస్టమస్ పండగను ఆస్ట్రేలియాలో వేసవిలోనూ, బ్రిటన్‌లో చలికాలంలోనూ ఎందుకు జరుపుకుంటారు?
* పగలు, రాత్రి సమయాలు ఏయే రోజుల్లో సమానంగా ఉంటాయి?
* పంచాయతీరాజ్ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? పంచాయతీ ఎన్నికల కోసం ఎవరో కోర్టుకు వెళ్లారు కదా! వారి గురించి చెప్పండి.
* సామాన్య మహిళలు, మహిళా కానిస్టేబుళ్లు వీరిలో మీరు ఎవరికి ప్రాధాన్యమిస్తారు? కారణం చెప్పండి.
* మహిళా కానిస్టేబుళ్లను వారి పైఅధికారులు వేధిస్తున్నారనే అపోహ ఉంది కదా! దాన్ని మీరు సమర్థిస్తారా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
* విద్యుత్ సంక్షోభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలేవి?
* విద్యుత్ సంక్షోభానికి కారణాలను తెలపండి.
* నదుల పూడికకు కారణాలను తెలపండి.
* మధ్యప్రదేశ్‌లోని రెండు ప్రధాన నదుల పేర్లు చెప్పండి. అక్కడ సాగునీటి పారుదల తక్కువగా ఉండటానికి కారణమేమిటి?
* థర్డ్ డిగ్రీపై మీ అభిప్రాయమేమిటి?
* ఆధార్ కార్డుకు, రేషన్ కార్డుకు తేడా ఏమిటి?
* మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? నచ్చడానికి కారణం చెప్పండి.
* యానిమేషన్, కార్టూన్‌కు మధ్య తేడా ఏమిటి?
* 3డీ లో ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు?
* అడ్మినిస్ట్రేటర్, మేనేజర్‌కు తేడా ఏమిటి?
* ఇండియా క్రికెట్ టీమ్‌లో ఎంతమంది ఉన్నారు? వారి పేర్లు చెప్పండి.
* వార్షిక ప్రణాళికలను ఎప్పుడు అమలు చేశారు? మీకు ఇష్టమైన వార్షిక ప్రణాళిక ఏది?
2013 మార్చి 7న
* అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలను వెనక్కి రప్పిస్తున్నారు. కారణమేమిటి?
* శ్రీలంకలో సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు తొలగించారు?
* విపత్తు అంటే ఏమిటి?
* లక్ష ఎకరాలను హెక్టార్లలో తెలపండి.
* టీచర్‌కు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలేమిటి?
* నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
* ఉచిత విద్యుత్ గురించి చెప్పండి.
* ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 కు మధ్య తేడా ఏమిటి?
* జిల్లా కోర్టులు, హైకోర్టుకి సబార్డినేట్‌గా పనిచేస్తాయి. ఇదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకి సబార్డినేట్‌గా పనిచేస్తుందా?
* దైవకణం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది?
* దైవకణం ప్రయోగానికి సంబంధించిన విజయాలు, అపజయాల గురించి తెలపండి.
* రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలకు మీరు సూచించే పరిష్కారాలేమిటి?
* రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్పండి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేవి?
* Composition of Earth గురించి చెప్పండి.
2013 మార్చి 6న
* ఎలక్షన్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ విధులేమిటి?
* సక్సెస్ స్కూల్, మోడల్ స్కూల్‌కు తేడా ఏమిటి?
* గాంధీజీ చేపట్టిన ఉద్యమమేమిటి?
* మీరు ఆరోగ్యశాఖ మంత్రి అయితే ఏ కార్యక్రమాలను చేపడతారు?
* విద్యార్థులు తెలుగు మీడియంలో చదివితే మంచిదా? ఇంగ్లిషు మీడియంలో చదివితే మంచిదా?
* మనరాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రుల పేర్లు చెప్పండి.
* కడప జిల్లాలో మినరల్ ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి?
* ఎన్‌పీఏ అంటే ఏమిటి?
* హవాలా ట్రాన్సాంక్షన్ అంటే ఏమిటి?
* Fake notes, Agreement and Contact గురించి తెలపండి.
* ఇండియా, చైనా రిలేషన్స్ గురించి తెలపండి.
* ఇంటర్‌పోల్ అంటే ఏమిటి?
* మీరు ఎస్సై అయితే... మీ దగ్గరికి ఒక కేసు వస్తే, తీసుకుంటారా? తీసుకోరా? కారణం చెప్పండి.
* పోలీస్ రిఫార్మ్స్ అంటే ఏమిటి?
* ఐపీసీ సెక్షన్స్ ఉమ్మడి ఉద్దేశం ఏమిటి?
* నేరపూరిత కుట్ర ఏ సెక్షన్ కిందకి వస్తుంది?
* డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి చెప్పండి.
* ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
2013 మార్చి 5న
* హైడ్రో సైకిల్ కాంపౌండ్ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ చెప్పండి.
* గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏమిటి?
* బుద్ధిజంలో జ్ఞానోదయం అంటే ఏమిటి?
* బౌద్ధం నేపాల్‌లో వ్యాప్తిలో ఉందిగానీ, ఇండియాలో ఎందుకు సర్వైవ్ కాలేకపోతుంది?
* వరకట్న నిషేధ చట్టం గురించి చెప్పండి.
* మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి తెలపండి.
* రాయలసీమలో మొదటి విశ్వవిద్యాలయం ఏది?
* చిత్తూరు జిల్లాలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? వాటి పేర్లు చెప్పండి.
* మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? డిగ్రీ ఎప్పుడు పూర్తి చేశారు? మీ కాలేజీ పేరేమిటి?
* కిడ్నీలలో స్టోన్స్ ఎందుకు వస్తాయి?
* మీ అభిమాన హీరోయిన్ ఎవరు? ఆవిడంటే ఎందుకు ఇష్టం? ఇటీవల విడుదలైన ఆమె నటించిన సినిమా ఏది? ఆవిడ మొత్తం ఎన్ని సినిమాలు చేశారు?
* కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం తగ్గుముఖం పట్టడానికి కారణాలేమిటి?
* మనదేశంలోని రాష్ట్రాలెన్ని?
* మీకు ఇష్టమైన ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లను చెప్పండి. వాళ్లంటే ఎందుకు ఇష్టమో తెలపండి?
* ఉత్తర అమెరికా కంటే దక్షిణ అమెరికా ఎందుకు వెనుకబడి ఉంది?
* బ్రిటన్ రాణి ప్రస్తుతం ఏయే దేశాలకు రాణిగా కొనసాగుతోంది?
* ఆర్థిక సంఘానికి, ప్రణాళికా సంఘానికి మధ్య తేడా ఏమిటి?
* ఇండియా - చైనా యుద్ధం గురించి చెప్పండి.
* నెహ్రూ అనుసరించిన అలీనవిధానం, సామ్యవాద తరహా విధానం గురించి చెప్పండి.
* కావేరీ జల వివాదం గురించి చెప్పండి.
* ఆర్థిక సంస్కరణలను ఎప్పడు ప్రవేశ పెట్టారు?
* What is the enlightment the Buddha achieved?
* What is the relationship between Religious Places and Tourism?
* What are the advantages and disadvantages of smaller states?
* Tell about yourself.
2013 మార్చి 4న
* పోలవరం టెండర్ల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది?
* ఎల్.పి.జి. గురించి వివరించండి.
* కృష్ణానది ఏయే జిల్లాల ద్వారా ప్రవహిస్తోంది? దానిపై ఏయే ప్రాజెక్టులు ఉన్నాయి?
* 'టెంపుల్ మేన్ ఆఫ్ ఇండియా' అని ఎవరిని అంటారు? ఎందుకు అంటారు?
* గ్లోబలైజేషన్ గురించి చెప్పండి.
* భారతదేశం బలాలు, బలహీనతలు ఏమిటి?
* ఎన్.సి.టి.సి. గురించి చెప్పండి.
* 1984, 1992, 2002లో ఇండియాలో జరిగిన సంఘటనలేవి?
* 'స్లీపింగ్ సెల్' గురించి చెప్పండి.
* కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది?
* రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏ ప్రాజెక్టులు ప్రకటించారు?
* శరీరంలో వినాళ గ్రంథులు ఏవి?
* పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీలను వేటికి వాడుతున్నారు?
* ఎల్‌సీడీ, ఎల్ఈడీ, ప్లాస్మా టీవీలకు తేడా ఏమిటి?
* అరబ్ దేశాల 'సివిల్ వార్' గురించి చెప్పండి.
* 'యూఎస్ఎస్ఆర్' విడిపోవడానికి కారణాలు ఏమిటి?
* బౌద్ధం గురించి చెప్పండి.
2013 మార్చి 2న
* ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. కారణమేమిటి?
* పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది కదా! ఆ అంశంపై మీ అభిప్రాయమేమిటి?
* ఇటీవల మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి వ్యాఖ్యానించండి.
* బంగ్లాదేశ్‌లో ఇటీవల ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. ఈ అంశం గురించి మీకు ఎంతవరకు తెలుసు?
* Tell about your hobbies.
* Tell about your District.
* మీ జిల్లా ప్రాముఖ్యం ఏమిటి?
2013 మార్చి 1న
* మహిళా రిజర్వేషన్లు కావాలని ప్రపంచంలో ఎక్కడా అడగడం లేదు? ఇండియాలో ఎందుకు అడుగుతున్నారు?
* ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం ఎక్కువగా విడాకులకు దారితీస్తోంది. మీరు దీంతో ఏకీభవిస్తారా?
* రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు. అయినా స్త్రీలు రాముడిని ఎందుకు పూజిస్తున్నారు?
* కార్బన్ ట్రేడింగ్ అంటే ఏమిటి?
* మున్సిపాలిటీ వాళ్లు నీటిని శుద్ధి చేయడానికి ఏ పద్ధతులను అనుసరిస్తున్నారు?
* క్యోటో ప్రోటోకాల్ అంటే ఏమిటి?
* బాబ్లీ ప్రాజెక్టు వివాదం గురించి చెప్పండి.
* DOD, TOD అంటే ఏమిటి?
* అడంగళ్ అంటే ఏమిటి? ఇది దేన్ని సూచిస్తుంది?
* భూ సేకరణలోని వివిధ దశల గురించి తెలపండి.
* సీఆర్పీఎఫ్‌లో 107, 108, 144, 145 సెక్షన్ల గురించి తెలపండి.
* సాండ్ (ఇసుక) పాలసీ గురించి తెలపండి.
* భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికుల గురించి తెలపండి.
* ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల గురించి తెలపండి.
* బుద్ధిజం గురించి తెలపండి.
* పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ మధ్య తేడా ఏమిటి?
* మహమ్మద్ అలీ జిన్నా గురించి తెలపండి.
* సతీసహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు?
2013 ఫిబ్రవరి 28న
* What is the importance of Warangal?
* ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి చెప్పండి.
* నక్సలిజం, ఫ్యాక్షనిజం మధ్య తేడా ఏమిటి?
* ఇండియా, పాకిస్థాన్ కలిసుంటే లాభాలేమిటి? నష్టాలేమిటి?
* మీరు మ్యాథ్స్ టీచరుగా పనిచేశారు కదా! రీసెంట్‌గా ఏ క్లాసుకి బోధించారు?
* లా మార్క్సిజం గురించి చెప్పండి.
* నియో-డార్వినిజం గురించి చెప్పండి.
* ఆర్డీవో విధుల గురించి చెప్పండి.
* క్లాసిఫికేషన్ ఆఫ్ కోర్-డేటా గురించి చెప్పండి.
* వికిలీక్స్ సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది?
* ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ గురించి చెప్పండి.
* మెటరాయిడ్, ఆస్టరాయిడ్ అంటే ఏమిటి?
* గ్రామీ అవార్డుల గురించి చెప్పండి.
* Why Viswarupam movie has been banned?
* What are the programmes done by Ministry of Women and Child Welfare developement
2013 ఫిబ్రవరి 27న
* చైనాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి?
* ఐఎమ్ఎఫ్, వరల్డ్ బ్యాంక్, బ్రిటన్ ఫుడ్‌లింక్స్ బ్యాంకులు భారత్‌కు ఎందుకు రుణాలనిస్తున్నాయి?
* విద్యాహక్కు చట్టంలో వచ్చిన మార్పులేమిటి?
* అంటార్కిటికా ఖండంలో ఎన్ని దేశాలున్నాయి?
* సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి చెప్పండి.
* ట్యాక్స్ వర్సెస్ బ్యూటీ గురించి చెప్పండి.
* థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి చెప్పండి.
* బిగ్‌బ్యాంగ్ థియరీ గురించి చెప్పండి.
* బ్లాక్ హోల్ థియరీ గురించి చెప్పండి.
* ఐసీఈఆర్ గురించి చెప్పండి.
* వొడాఫోన్, బ్లాక్‌బెర్రీ విభాగం గురించి చెప్పండి.
* వై-ఫై, బ్లూటూత్ రిలేషన్స్ ఏమిటి?
* వై-ఫై అంటే ఏమిటి? ఇంటర్నెట్ అంటే ఏమిటి?
* ఇంటర్నెట్‌కు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకు సంబంధం ఏమిటి?
* రుద్రమదేవి, పూలందేవి గురించి చెప్పండి.
* కర్నూలు జనాభా ఎంత?
* కర్నూలులోని ప్రముఖ దేవాలయాల గురించి చెప్పండి.
* విద్యుత్ సంక్షోభాలను ఎలా నివారించవచ్చు?
* విత్తన వ్యాప్తి, ఫలాల వ్యాప్తి ఎలా జరుగుతుంది?
* జన్యుపరివర్తనకు సంబంధించి మొక్కల్లో, జంతువుల్లో మార్పులు రావడానికి కారణాలేమిటి?
* రైల్వే బడ్జెట్‌ను ఎందుకు వేరుగా ప్రవేశపెడుతున్నారు? కారణాలను విశ్లేషించండి.
* మీరు చిన్న రాష్ట్రాలను సమర్థిస్తారా?
* జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?
* విజయనగరం జిల్లా హెచ్‌డీఐలో ఎందుకు వెనుకబడి ఉంది?
* గురజాడ రచనల గురించి చెప్పండి. కన్యాశుల్కం చదివారా?
* మీకు కొంత భూమిని ఇచ్చి కూరగాయలు, ఫలాలు, ఔషధ మొక్కలను పండించమంటే మీరు వేటిని పండిస్తారు?
2013 ఫిబ్రవరి 26న
* మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై మీ అభిప్రాయం చెప్పండి.
* ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? అది ఏర్పడటానికి కారణాలేమిటి?
* బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు తగ్గుతున్నాయి?
* ఆర్మీలో కల్నల్ హోదా ఎవరెవరికి ఇచ్చారు?
* పుణ్యక్షేత్రాలకు, పర్యావరణానికి ఏమైనా సంబంధం ఉందా?
* ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌ను ఎప్పుడు ప్రతిపాదించారు?
* వరంగల్ ప్రాముఖ్యం ఏమిటి?
* కాంతి విద్యుత్ ఫలితం అంటే ఏమిటి?
* ఆర్కిమెడిస్ సూత్రం చెప్పండి.
* సూత్రాన్ని వివరించండి.
* ఆటంబాంబు, అణుబాంబులను ఎలా తయారు చేస్తారు? ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడా ఏమిటి?
* రామన్ ఎఫెక్ట్‌లో ఏం జరుగుతుంది?
* PSLV లో పోలార్ అంటే ఏమిటి?
* క్వాంటం మెకానిక్, క్లాసిక్ మెకానిక్ మధ్య తేడా తెలపండి.
* ఆసియా ఖండం అభివృద్ధి చెందడానికి కారణాలను చెప్పండి.
* గిరిజనులు సమాజం నుంచి దూరంగా ఎందుకు ఉంటున్నారు?
* కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం వల్ల ప్రజలకు సమస్యలేమిటి? దాని వల్ల కలిగే లాభ, నష్టాలేమిటి?
* ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మధ్య తేడా తెలపండి.
* రసాయనశాస్త్రంలో ప్రధానమైన శాఖలేవి?
* బెంజిన్‌ను కనుక్కున్నదెవరు? దాని నిర్మాణం తెలపండి.
* మహారాష్ట్ర రాజధాని ఏది? ఆ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు నాలుగింటి గురించి చెప్పండి.
* ఆదిలాబాద్‌లో ఉన్న ప్రాజెక్టులు, నదుల గురించి చెప్పండి.
* సార్క్‌లో ఎన్ని దేశాలున్నాయి?
* పులికాట్, కొల్లేరు సరస్సులు ఎక్కడ ఉన్నాయి?
* కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
* మనరాష్ట్రంలో ఉన్న పోర్టుల గురించి చెప్పండి.
* సీవీ రామన్, రవీంద్రనాథ్ టాగూర్ గురించి చెప్పండి.
* ఆస్కార్ అవార్డుల గురించి తెలపండి.
* యాక్ట్, ఆర్డినెన్స్ మధ్య తేడా ఏమిటి?
* రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్ మధ్య తేడా తెలపండి.
* అన్నా హజారే ఎవరు? ప్రస్తుతం ఆయన చేస్తున్నదేమిటి?
* వరంగల్ వేయి స్తంభాలగుడిలో వేయి స్తంభాలు ఉన్నాయా?
* ఎంబీఏ సబ్జెక్టుల గురించి చెప్పండి.
* ఏటూరునాగారం వరంగల్ జిల్లాలో ఎక్కడ ఉంది?
* కజిరంగా, మదుమలై గురించి చెప్పండి.
* ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఎవరు?
* అలహాబాద్ గురించి చెప్పండి
2013 ఫిబ్రవరి 25న
* SAARC తో భారతదేశానికి ఎలాంటి సంబంధం ఉంది?
* మైన్మార్‌లో ప్రస్తుతం ఉన్న క్లిష్ట సమస్యను తెలపండి.
* SAARC సభ్యదేశాలు ఏవి?"
* మీ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టుల పేర్లు చెప్పండి.
* రాష్ట్రప్రభుత్వ పథకాల్లో మీకు నచ్చిన రెండు పథకాల గురించి తెలపండి.
* NATO ఎందుకు ఏర్పడింది?
* 'నక్సల్స్ ఉద్యమం' అనే పేరు ఎలా వచ్చింది?
* చైనా ఉత్పత్తులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?
* మీ మండలం, జిల్లా విస్తీర్ణం ఎంత?
* మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
* ప్రభుత్వ అధికారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?
* కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పండి.
* రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమిటి?
* పార్లమెంట్‌లో లోక్‌సభ రద్త్దెతే బడ్జెట్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది?
* భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోవడానికి గల కారణాలు ఏమిటి?
2013 ఫిబ్రవరి 23న
* డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి చెప్పండి.
* కమ్యూనిజం, టెర్రరిజం - ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం?
* మన దేశంలో ముఖ్యమైన నదులేవి? అవి ఏయే రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తున్నాయి?
* దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల దృష్ట్యా టెర్రరిజం గురించి చెప్పండి.
* లోక్‌పాల్‌కు, జన్‌లోక్‌పాల్‌కు తేడా ఏమిటి?
* మీ జిల్లా (గుంటూరు) గురించి చెప్పండి.
* మీ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి?
* మైక్రో బయాలజీ ప్రాధాన్యం చెప్పండి.
* ఫ్యామిలీ కోర్టు అంటే ఏమిటి?
* ఇరాన్, అఫ్గానిస్థాన్ గురించి చెప్పండి.
* ఒబామా సాధించిన విజయాలు, వైఫల్యాలు ఏవి?
* మలాలా ఎవరు? ఆమె గురించి చెప్పండి.
* రజాకార్లు ఎవరు?
* భూసంస్కరణల గురించి చెప్పండి.
* మహబూబ్‌నగర్ జిల్లాకు పాలమూరు అనే పేరు ఎందుకు వచ్చింది?
* మహబూబ్‌నగర్ జిల్లా విస్తీర్ణం ఎంత? జనాభా ఎంత?
* ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక గురించి చెప్పండి.
* తూర్పు కోస్తా తీరంలో ఉన్న నౌకాశ్రయం ఏది?
* ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు చెప్పండి. వాటిలో మీకు ఏది నచ్చింది? ఎందుకు నచ్చింది?
* మన విద్యా వ్యవస్థలో లోపాలేంటి?
2013 ఫిబ్రవరి 22న
* ముళ్ల పెరియార్ డ్యాం వివాదం గురించి తెలపండి.
* Pumpaz అంటే ఏమిటి?
* భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వొచ్చా?
* ఓడరేవుల గురించి తెలపండి.
* మోడల్, సక్సెస్ స్కూళ్లు ఎంత వరకు అభివృద్ధి సాధించాయి.
* మీరు ప్రత్యేక తెలంగాణకు మద్ధతిస్తారా? లేదా సమైక్యాంధ్రకు మద్ధతిస్తారా? ఎందుకు మద్ధతిస్తారు?
* నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ప్రాబల్యం కోల్పోయింది?
* విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు?
* పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న సమస్యలేవి?
* బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆ వ్యక్తి తండ్రి పేరు ఏమిటి?
* పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ పెట్టిన పార్టీ ఏది?
* ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల క్రమాన్ని వివరించండి.
* ప్రయోగశాలలో ఆక్సీజన్‌ను ఎలా తయారు చేస్తారు?
* Labour Act లోని అంశాలేవి?
* Strike మరియు Locked Out కి తేడా ఏమిటి?
* లౌకికవాద విధానాన్ని మనదేశం ఎందుకు స్వీకరించింది?
* గౌతు లచ్చన్న ఎవరు?
* INDUSTRY నిర్వచనం చెప్పండి? దాని గురించి తెలపండి?
* అమెరికా, ఇరాక్ మీద ఎందుకు దాడి చేసింది?
* నక్సలిజం తగ్గడానికి కారణాలు ఏమిటి?
* IDLU ను విస్తరించండి?
* Slage అంటే ఏమిటి?
2013 ఫిబ్రవరి 21 న
* మహారత్న కంపెనీకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? బీఎస్ఎన్ఎల్‌కు మహారత్న ఇవ్వవచ్చా? ప్రస్తుతం ఎన్ని మహారత్న కంపెనీలు ఉన్నాయి?
* సాఫ్ట్‌వేర్‌కు, హార్డ్‌వేర్‌కు తేడా చెప్పండి.
* భారతదేశ విద్యుత్ వ్యవస్థ గురించి చెప్పండి.
* ప్రపంచంలోని ఏడు అద్భుతాలు ఏవి?
* మైక్రో ఇరిగేషన్ గురించి చెప్పండి.
* వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించి చెప్పండి.
* ఒలింపిక్స్‌లో క్రీడాకారులు డోపింగ్ చేస్తుంటారు కదా? అది మంచిదేనా? ఎవరెవరు చేస్తారు?
* అమెరికాలో సబ్ ప్రైమ్ లెండింగ్ గురించి చెప్పండి.
* బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి చెప్పండి.
* ఒలింపిక్ చిహ్నంలోని వలయాల గురించి చెప్పండి.
* డేటింగ్ గురించి చెప్పండి.
2013 ఫిబ్రవరి 20న
* సిరియా సంక్షోభం గురించి చెప్పండి.
* తళ్లికోట, ప్లాసీ యుద్ధాల గురించి తెలపండి.
* Carbon Dating అంటే ఏమిటి?
* బాలకార్మిక వ్యవస్థ గురించి వివరించండి.
* పాలమూరుకు ఆపేరెలా వచ్చింది?
* పాలమూరు జిల్లాలో వలసలు, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటానికి గల కారణాలు తెలపండి.
* విద్యాహక్కు చట్టం గురించి చెప్పండి.
* ఉత్తర భారత దేశంలోని 5 రాష్ట్రాల పేర్లు తెలపండి.
* 'మన బియ్యం' పథకం గురించి మాట్లాడండి.
* మీ జిల్లాలో MGNREGS వల్ల వలసలు తగ్గాయా? పెరిగాయా?
* మీ మండలంలోని హైస్కూళ్ల సంఖ్య ఎంత?
* మీ మండలంలో వచ్చే వార్తా పత్రికల గురించి చెప్పండి.
* ప్రపంచంలోని ప్రముఖ మహిళా నాయకురాళ్ల పేర్లు తెలపండి.
* మనదేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు తెలపండి.
* ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మహిళా మంత్రులు ఎవరు?
* రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు ఎవరు?
* Accounts కు Audits కు మధ్య తేడాను తెలపండి.
2013 ఫిబ్రవరి 19న
* ఇటీవల వివిధ దేశాల అధిపతులు మనదేశాన్ని ఎందుకు సందర్శిస్తున్నారు?
* అబ్దుల్‌కలాం గురించి మీకేం తెలుసు?
* వీధిబాలలకు మీరు ఏరకమైన సేవ చేయగలరు?
* కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రహదార్ల పథకం పేరేమిటి?
* శ్రీనాథుడు రాసిన ఒక పద్యాన్ని చెప్పి, దాని అర్థం తెలపండి.
* కృష్ణానది వరుసగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే జిల్లాల్లో ప్రవహిస్తుందో చెప్పండి.
* లిటిల్ ట్రెడిషన్, గ్రేట్ ట్రెడిషన్ అంటే ఏమిటో తెలపండి.
* చిన్న రాష్ట్రాల వల్ల కలిగే నష్టాలేవి?
* గరిబీ హఠావోను ఎన్నో పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
* మైక్రో ఫైనాన్స్ డిమానిస్ట్రేషన్ వల్ల నష్టాలేవి?
* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి.
* అనంతపురం జిల్లాకు రుతుపవనాలు ఎందుకు లేవు?
* Tell about your hobbies
2013 ఫిబ్రవరి 18న
* అంతర్జాతీయ సమస్యలకు శాంతి సందేశాన్ని ఎవరు ఇస్తారు? ప్రస్తుతం ఎలా చేస్తున్నారు?
* Land Acquisition, Re-settlement ఎలా చేస్తారు?
* సిరియా గురించి చెప్పండి.
* What is your order of preferences of job ?
* రాష్ట్రపతి శిక్షను ఏవిధంగా తగ్గిస్తారు? ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి శిక్షను తగ్గించే అధికారం ఉంది?
* మెర్సీ పిటిషన్‌పై మీ అభిప్రాయం ఏమిటి?
* Was capital punishment should be there or not?
* ఇందిరప్రభ, ఇందిర జలప్రభ మధ్య తేడా తెలపండి
* ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నికైనవారి పేరు చెప్పండి.
* మహిళా కమిషన్ ప్రస్తుత ఛైర్మన్ ఎవరు?
* మీ మండలంలో ఎంత మంది ఉన్నారు? దాని విస్తీర్ణం ఎంత?
* మీ జిల్లా జనాభా ఎంత?
* ఏవైనా ఆరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి చెప్పండి.
* ఇమ్మిగ్రేషన్ విధానం గురించి తెలపండి.
* సెక్యులరిజం గురించి చెప్పండి.
* ఇటీవల మైనారిటీలను ఎక్కువగా అరెస్టు చేస్తున్నారు. దేశంలో సెక్యులరిజం ఉందా? లేదా? మీ అభిప్రాయం చెప్పండి.
* ఆదిలాబాద్ జిల్లా గురించి చెప్పండి.
* ప్రపంచవ్యాప్తంగా మీకు తెలిసిన ట్రైబ్స్ గురించి చెప్పండి.
* అక్బరుద్దీన్ బెయిల్ సాంక్షన్‌కు సంబంధించిన పరిణామాల గురించి తెలపండి.
* జనగణనలో సెన్సస్‌ను ఎలా ఉపయోగిస్తారు?
* గ్రామసభ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేమిటి?
* రాజ్యసభ, లోక్‌సభ మధ్య తేడాలేమిటి?
* ఒక అధికారిగా నగదుబదిలీ పథకాన్ని గవర్నమెంటు స్కీముగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు?
* MGNREGS ప్రోగ్రామ్ ఈమధ్యకాలంలో కొంచెం స్లో అయింది కదా! దానికి కారణాలేమిటి? ఇటీవల దానికి సంబంధించి మీరు గమనించిన మార్పులేమిటి?
* ఆర్థికవ్యవస్థలో చైనా ముందు వరుసలో ఉండటానికి కారణాలేమిటి?
* భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఉన్న అర్హతలేవి?
2013 ఫిబ్రవరి 16న
* భారత్‌కు సరిహద్దు దేశాలతో ఉన్న సంబంధాల గురించి తెలపండి.
* ఇండియాలో స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి గురించి తెలపండి.
* ఫిస్కల్ ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు మధ్య తేడాలేమిటి?
* తెలుగులో ఒక పద్యం చెప్పి, దాని అర్థం వివరించండి.
* జీపీఎస్ అంటే ఏమిటి?
* జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏమిటి?
* సన్ సింక్రొనస్ శాటిలైట్ గురించి చెప్పండి.
* ఉల్కల గురించి తెలపండి.
* మయన్మార్ దేశ పరిస్థితుల గురించి తెలపండి.
* బ్లాక్ హోల్ థియరీ గురించి తెలపండి.
* ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అడగటానికి కారణాలేమిటి?
* నగదు బదిలీ పథకం వల్ల లాభ, నష్టాలను తెలపండి.
* అవినీతి గురించి చెప్పండి.
* మధ్య ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల పేర్లు చెప్పండి.
* గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల సమస్యల గురించి తెలపండి.
* వ్యవసాయం లాభదాయకంగా లేదు. ఎందుకు?
* సైన్స్ కాంగ్రెస్ అంటే ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి?
* ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి?
* ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి చెప్పండి.
* ఇండో, చైనా సంబంధాల గురించి తెలపండి.
* ఎనర్జీ, పవర్ మధ్య తేడా ఏమిటి?
* చైనాలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి కారణమేమిటి?
* చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకత ఏమిటి?
* విద్యాహక్కు చట్టంలో 25 శాతం ప్రైవేటీకరణ అవసరమా?
* భారత ప్రామాణిక రేఖాంశం ఏది? అది ఏయే రాష్ట్రాల ద్వారా పోతోంది?
* గంగానది ఏయే రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తోంది? బంగ్లాదేశ్‌లో దాన్ని ఏమని పిలుస్తారు?
* భారత్, చైనా మధ్య బ్రహ్మపుత్రా సమస్య గురించి తెలపండి.
* భారత్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి?
* ఇండియా జనసాంద్రత ఎంత?
2013 ఫిబ్రవరి 15న
* మానవహక్కులు నాలుగు దశలుగా అభివృద్ధి చెందాయి. ఆ దశలేవి?
* ఒబామా ఎవరు? అతడిది ఏ పార్టీ? ఒబామా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏమేం చేశాడు? ఏమేం చేయలేదు?
* షెడ్యూల్ అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ఏ షెడ్యూల్ కిందకి వస్తుంది?
* ఆరో షెడ్యూల్ ఏ రాష్ట్రం గురించి చెబుతుంది?
* వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమిటి? బ్రాహ్మణులు, క్షత్రియలు, వైశ్యులు, శూద్రులు... వీరిలో ఎవరినైనా షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా చేస్తారా? ట్రైబ్స్‌ని షెడ్యూల్డ్ కేటగిరీల్లో ఉంచడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి?
* సార్క్ ప్రాధాన్యం ఏమిటి?
* బ్రిక్స్ అంటే ఏమిటి? వాటి ప్రాధాన్యం ఏమిటి?
* యూరోపియన్ యూనియన్ ప్రాధాన్యం ఏమిటి? ఇటీవల దీనికి ఏ బహుమతి ఇచ్చారు?
* పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్యలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తోంది. ఐక్యరాజ్యసమితి అమెరికాను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?
* ఐక్యరాజ్యసమితి లక్ష్యాలేమిటి?
* మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మీ జిల్లాలో ఉన్న అతిపెద్ద ట్రైబ్ ఏది?
* ఆరోగ్యశ్రీ గురించి చెప్పండి.
* బుద్ధిజం గురించి తెలపండి.
* CROP గురించి చెప్పండి.
* మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ గురించి చెప్పండి.
* శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యల గురించి చెప్పండి. (అభ్యర్థి శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు)
* జీడీపీ అంటే ఏమిటి? దాన్ని గణించే పద్ధతులేవి?
* Sin2θ, Sin3θ ఫార్ములాలు చెప్పండి
* శక్తి నిత్యత్వ నియమం గురించి చెప్పండి.
* బాయిలింగ్ పాయింట్ డెఫినెషన్ చెప్పండి.
* క్రెడిట్ కార్డ్స్ డిసడ్వాంటేజెస్ గురించి తెలపండి.
* చార్లెస్ నియమం, బాయిల్ నియమం, గ్రాహమ్ నియమాలను చెప్పండి.
* అవగాడ్రో సంఖ్య అంటే ఏమిటి?
* కొన్ని ఆర్గానిక్, ఇనార్గానిక్ సమ్మేళనాల పేర్లు చెప్పండి.
2013 ఫిబ్రవరి 14న
* విశాఖపట్నం ప్రాముఖ్యం ఏమిటి?
* ప్రకాశం జిల్లాలో ఏయే నదులు ప్రవహిస్తాయి?
* ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లోని మహిళా మంత్రుల గురించి చెప్పండి.
* పోలరైజేషన్ అంటే ఏమిటి?
* భూమి ఉపయోగాలను తెలపండి.
* స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్రను తెలపండి.
* ఎ నుంచి ఇ వరకు ఉన్న విటమిన్లను తెలపండి. వాటి ఉపయోగాలేమిటి?
* మీ జిల్లా వెనుకబడి ఉండటానికి కారణమేమిటి? (అభ్యర్థి శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు)
* SAARC గురించి చెప్పండి.
* మేధోహక్కులు అంటే ఏమిటి?
* శ్రీలంక తమిళులు, ఎల్‌టీటీఈ సమస్య గురించి చెప్పండి.
* దక్షిణాఫ్రికా ఖండంలో ఫుట్‌బాల్ ఆడే 5 దేశాల పేర్లు చెప్పండి.
* నోబెల్ బహుమతి పొందిన వైద్యుల పేర్లు చెప్పండి.
* కిలో చక్కెర ధర ఎంత?
* బస్తా సిమెంటు ధర ఎంత?
* మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు?
2013 ఫిబ్రవరి 13న
* సమాజానికి మైక్రోబయాలజీ అవసరం ఏవిధంగా ఉంది?
* గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏమిటి?
* గోల్డెన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మధ్య భేదం ఏమిటి?
* ప్రధానమంత్రి సడక్ యోజన గురించి చెప్పండి.
* What is Bio-Terrorism?
* బయోకెమికల్ వెపన్ అంటే ఏమిటి? ప్రపంచంపై దాని ప్రభావమేమిటి?
* What is the work done by 7th Nizam Meer Usman Alikhan?
* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి?
* భూసంస్కరణల గురించి చెప్పండి.
* పీహెచ్‌సీ, అంగన్‌వాడీల గురించి చెప్పండి.
* ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మధ్య తేడా ఏమిటి?
* ప్రపంచంలోని మహిళా నాయకుల పేర్లు చెప్పండి.
* ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి తెలపండి.
* అడంగళ్ అంటే ఏమిటి?
* RSR అంటే ఏమిటి?
* డిప్యూటీ తహశీల్దార్ విధులేమిటి?
* ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి మీరిచ్చే సూచనలేమిటి?
* ఇండియా, యూఎస్ఏ రిలేషన్స్ గురించి తెలపండి.
* భారత్, అఫ్గానిస్థాన్ సంబంధాల గురించి తెలపండి.
ఫిబ్రవరి 12న
* బౌద్ధమతం గురించి వివరించండి.
* 'ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ గురించి తెలపండి.
* నల్లబొగ్గు కుంభకోణం గురించి తెలపండి.
* 2జి - కుంభకోణం గురించి వివరించండి.
* భారతదేశం ఐటీ రంగంలో మొదటిస్థానంలో ఉండటానికి గల కారణం ఏమిటి?
* మ్యాథమెటిక్స్ బేసిక్స్ చెప్పండి.
* భారతదేశంలో 'ఇన్నోవేషన్స్ ఎందుకు తక్కువగా ఉన్నాయి?
* హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల గురించి వివరించండి.
* డిమాండ్, సప్త్లె గురించి తెలపండి.
* 1 చదరపు కిలో మీటరుకి ఎన్ని హెక్టార్లు?
* 'బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమిటి?
* డిమాండ్ పెరిగితే సప్త్లె ఏమవుతుంది?
* నల్గొండ జిల్లా విస్తీర్ణం ఎంత?
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో 5 రకాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించండి.
* ఐసోటోపులు అంటే ఏమిటి?
* న్యూటన్ గమన నియమాల గురించి వివరించండి.
* ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణాలను తెలపండి.
* ఉపాధ్యాయుడి లక్షణాలేవి?
* మహిళా సాధికారతకు ఏ విధంగా కృషి చేయాలి?
ఫిబ్రవరి 11న
* గోదావరి పరివాహక ప్రాంతాలేమిటి?
* గ్రీన్‌హౌస్ వాయువులు, వాటి ప్రభావం ఏమిటి?
* పి.డి.ఎస్. గురించి చెప్పండి?
* రాష్ట్రంలో అమలవుతున్న ఉద్యోగ పథకాలేమిటి?
* అణు ఒప్పందం గురించి చెప్పండి?
* బెంజీన్ అభివృద్ధి గురించి చెప్పండి?
* రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? దాన్లో స్పెషల్ చిల్డ్రన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి?
* వీడాల గురించి చెప్పండి?
* డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కేయూ శాటిలైట్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు కదా. దీనిగురించి మీకేమైనా తెలుసా?
* మాన్‌సూన్స్ గురించి తెలపండి?
* ఒక పద్యం, దాని అర్థాన్ని వివరించి అది ఏ అలంకారంలో ఉందో కూడా చెప్పండి?
* అమెరికాలో అతిచిన్న రాష్ట్రం ఏది?
* దేశంలో హైకోర్టుల సంఖ్య ఎంత?
* భారతదేశంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు?
* యూఎస్ఎస్ఆర్ ఎప్పుడు ఏర్పడింది, దాని గురించి తెలపండి?
* అష్టదిగ్గజాలు అంటే ఎవరు, వారి పేర్లు, వారి రచనలు చెప్పండి?
* ఈ గవర్నెన్స్ గురించి చెప్పండి?
* ఆధార్ విశిష్టత గురించి తెలపండి?
* సైమన్ కమిషన్ గురించి చెప్పండి?
* ప్రాథమిక హక్కుల గురించి చెప్పండి?
* వరిలో ఎన్ని రకాలున్నాయి?
* ఐరాస, నానాజాతి సమితిల మధ్య తేడాలేమిటి?
* ఐరాస ప్రధాన లక్షణాలేమిటి?
* మీ సేవ గురించి చెప్పండి?
* కృష్ణా ట్రైబ్యునల్ వివాదమేమిటి?
* అణు విద్యుత్ ఎలా తయారవుతుంది?
* సిటిజన్ ఛార్టర్ గురించి చెప్పండి?
ఫిబ్రవరి 6న
* అఫ్గానిస్థాన్‌పై అమెరికా ఆధిపత్యం గురించి చెప్పండి.
* భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలేవి?
* 'క్లౌడ్ కంప్యూటింగ్' గురించి చెప్పండి.
* ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మధ్య ఉన్న దేశాలేవి?
* 'ఫైనాన్షియల్ బిల్' గురించి చెప్పండి.
* ఏయే రాష్ట్రాల్లో విధానసభ, విధానపరిషత్ రెండూ ఉన్నాయి?
* క్రికెట్ గురించి చెప్పండి.
* వాతావరణంలో మార్పులు ఎందుకు, ఎలా వస్తున్నాయి?
* సహాయనిరాకరణ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
* మహాత్మాగాంధీని ప్రభావితం చేసినవారు ఎవరు? ఆయన నుంచి ప్రభావితమైనవారు ఎవరు?
* ఎం.ఎల్.సి. ఎన్నికల గురించి వివరంగా చెప్పండి.
* మీ మండలం విస్తీర్ణం ఎంత?
* మీ జిల్లా వైశాల్యం ఎంత?
* మీ జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాలేవి?
* మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ గురించి చెప్పండి.
* డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ విధులేమిటి?
* ఆర్.ఎస్.ఆర్.లో ఉండి అడంగళ్‌లో లేనిది ఏది?
* భూసేకరణ విధానం గురించి చెప్పండి.
* సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు అందులో ఉన్న సభ్యుల పేర్లు చెప్పండి.
* కామన్వెల్త్ దేశాలేవి?
* 'లాండ్ అసైన్‌మెంట్' గురించి చెప్పండి.
* నోబెల్ బహుమతిని ఏయే రంగాల వారికి ఇస్తున్నారు? ఈ ఏడాది సాహిత్యంలో బహుమతి ఎవరికి వచ్చింది?
* నార్వే రాజధాని ఏది?
* నిరుద్యోగ సమస్య గురించి చెప్పండి.
* ఎందుకు గ్రూప్ - 1 అధికారి కావాలనుకుంటున్నావు?
* 'రాజీవ్ యువకిరణాలు' గురించి చెప్పండ
* భారత అణువిధానం గురించి చెప్పండి.
* 'ఇండియన్ ఎయిర్‌ఫోర్స్' ఎప్పుడు ఏర్పడింది?
* 'సిటిజన్ చార్టర్' అంటే ఏమిటి?
* 'ఈ సేవ' పరిపాలనా విధానం గురించి చెప్పండి.
* దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా ఎలాంటి తోడ్పాటు అందించారు?
* 'మాడ్యులర్ ఎంప్లాయిబిలిటీ స్కీమ్' గురించి చెప్పండి.
ఫిబ్రవరి 5న
* ప్లానింగ్ కమిషన్ ఫంక్షన్స్ ఏమిటి?
* ఫైనాన్స్ కమిషన్ ఫంక్షన్స్ ఏమిటి?
* ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పండి.
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలపండి.
* మీ జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి తెలపండి.
* వాటర్‌షెడ్ అంటే ఏమిటి?
* కుంభమేళా గురించి తెలపండి.
* మీకు నచ్చిన ప్రభుత్వ పథకాల గురించి తెలపండి.
* మీ జిల్లా ప్రధాన ఆదాయమెంత? జనాభా ఎంత?
* CAG అంటే ఎవరు?
* పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు తేడా ఏమిటి?
* మీ జిల్లాలో కల్తీసారా తాగి చాలా మంది మరణించారు? మద్యం షాపులకు అనుమతివ్వడం కరక్టేనా?
* సోలార్ మిషన్ అంటే ఏమిటి? అది ఏ రాష్ట్రంలో డెవలప్ అయింది? మనరాష్ట్రంలో ఎందుకు కాలేదు?
* భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
* ఇండియాలో మొదటి మహిళా రూలర్ ఎవరు?
* భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలెవరు?
* యువతపై మీడియా ప్రభావమేమిటి?
* అమెరికా ప్రెసిడెంటుకు, ఇండియా ప్రెసిడెంటుకు తేడా ఏమిటి?
* ఇండియాలో సుగంధద్రవ్యాలు ఎక్కువగా ఎక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి?
* ప్రపంచంలో గ్రానైట్ టెంపుల్ ఎక్కడ ఉంది?
(అభ్యర్థి జిల్లాలకు సంబంధించిన సమాచారంపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.)
ఏడో రోజు (ఫిబ్రవరి 4)
* ఎందుకు గ్రూప్ - 1 అధికారి కావాలనుకుంటున్నావు?
* కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పండి.
* గోవా రాజధాని ఏమిటి?
* ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అనాథాశ్రమాల గురించి చెప్పండి.
* అనంతపురం జిల్లా ఎందుకు వెనుకబడి ఉంది?
* రాజీవ్ యువకిరణాలు, రాజీవ్ విద్యామిషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి వివరించండి.
* చట్టం, ధర్మం, న్యాయం - వీటిలో గ్రూప్ - 1 అధికారిగా దేనికి ప్రాధాన్యం ఇస్తావు?
* లోక్‌పాల్ గురించి చెప్పండి.
* విప్రో స్థాపకుడు ఎవరు?
* క్రికెట్ గురించి చెప్పండి.
* వివేకానందుడు యువతకు ఎలా ఆదర్శప్రాయుడో చెప్పండి.
* ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని లోక్‌సభ, రాజ్యసభ స్థానాలు కేటాయించారు?
* 'డిస్నీ హుడ్' అంటే ఏమిటి?
* 'ట్యునీషియా' విప్లవం గురించి చెప్పండి.
* గోవా హైకోర్టు ఎక్కడ ఉంది?
* 'నిర్భయ' సంఘటన తదనంతర పరిణామాల్లో పౌరుల పాత్ర గురించి చెప్పండి.
* 'ఆమ్ ఆద్మీ' అనే పదాన్ని ఎక్కడ విన్నారు?
* ఇండో - చైనా సంబంధాల గురించి చెప్పండి.
* లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని ఎస్సీ, ఎస్టీ స్థానాలను రిజర్వ్ చేశారు?
ఆరో రోజు (ఫిబ్రవరి 2)
* ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి?
* భారత్ - బంగ్లాదేశ్; భారత్- చైనా సంబంధాల గురించి చెప్పండి.
* అలీనోద్యమంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 1942 అలీనోద్యమం సమయంలో ప్రపంచం రెండు ధ్రువాలుగా విడిపోయింది. ఒక్కో ధ్రువానికి ఏ దేశం ప్రాతినిధ్యం వహించింది?
* శ్రీనిధి, మార్పు, ఇందిర జలప్రభ పథకాల గురించి చెప్పండి.
* ముస్లింలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు?
* అంతర్జాతీయ న్యాయస్థానం పనితీరు గురించి చెప్పండి.
* మనదేశం ఏడాదికి ఎన్ని కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తోంది?
* 'కోస్ట్‌గార్డ్ యాక్ట్' ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
* సార్క్ గురించి చెప్పండి.
* 'ఐసోటోపులు' అంటే ఏమిటి?
* ఆసియాన్, సార్క్ సభ్య దేశాలేవి?
* తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి చెప్పండి.
* పన్నుల ద్వారా ఏయే శాఖల నుంచి ఎంత ఆదాయం వస్తోంది?
* ఉపాధి హామీ పథకం గురించి చెప్పండి.
* వైద్యరంగంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది?
* ఎందుకు ఎక్కువమంది వైద్యులు అవినీతిపరులుగా ఉంటున్నారు?
అయిదో రోజు (ఫిబ్రవరి 1)
* మీకు తెలిసిన భారతీయ నృత్యాలు చెప్పండి.
* వరంగల్ ప్రాముఖ్యం ఏమిటి?
* What are the gases in atmosphere. వాటిలో కొన్నింటి గురించి చెప్పండి.
* SHARK గురించి చెప్పండి.
* పది మంది ప్రెసిడెంట్ల పేర్లు చెప్పండి.
* ఏదైనా ఒక పద్యం చెప్పండి...... దాన్ని ఎవరు రాశారు? ఏ పుస్తకంలో ఉంది?
* సోషల్ నెట్‌వర్క్ సైట్ల వల్ల లాభాలేమిటి? నష్టాలేమిటి?
* బిల్‌గేట్స్ ఎవరు?
* Who is the founder of facebook?
* గుటెన్‌బర్గ్ నిర్మాత ఎవరు?
* విద్యా హక్కు చట్టం గురించి చెప్పండి.
* మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు?..... కారణం ఏమిటి?
* సౌర కుటుంబం గురించి చెప్పండి.
* మద్యపానం వల్ల నష్టాలేమిటి?
* మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి తెలపండి.
* తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల గురించి తెలపండి.
* తెలుగు మహాసభల చిహ్నమేమిటి?
* మీకు నచ్చిన ప్రభుత్వ పథకం గురించి తెలపండి.
* ఉపాధి హామీ పథకం గురించి మీ అభిప్రాయం చెప్పండి
నాలుగో రోజు (జనవరి 31)
* తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలేమిటి?
* లోక్‌సభలో 108 బిల్లు వీగిపోవడానికి కారణాలేమిటి?
* ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడానికి కారణాలేమిటి? ఇవ్వకపోవడానికి కారణాలేమిటి?
* ఇమేజినరీ నంబర్ల గురించి ఎలా వివరిస్తారు? (అభ్యర్థి గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు)
* Sin3A = ? (అభ్యర్థి గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు)
* 2Sin(2A+A) ను రాసి, విస్తరించండి. (అభ్యర్థి గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు)
* Magna అంటే ఏమిటి?
* సునామీ, తుపానుకు మధ్య తేడా ఏమిటి?
* మైనింగ్, ఓపెన్ మైనింగ్ అంటే ఏమిటి? వాటి మధ్య తేడా ఏమిటి?
* డ్రింకింగ్ వాటర్ కోసం వేసే బోర్లు ఎక్కువగా ఫెయిలవ్వడానికి కారణమేమిటి?
* డ్రైనేజీ సప్త్లె ఎలా ఉండాలని భావిస్తున్నారు?
* అర్జెంటీనా, కాంబోడియా క్యాపిటల్ సిటీలను తెలపండి.
* అత్యధిక మహిళలు ఉన్న పార్లమెంట్ ఏది?
* ముగ్గురు తెలుగు కవుల పేర్లు చెప్పండి.
* సుమతీ శతకం నుంచి ఒక పద్యం చెప్పండి.
* వేమన శతకం నుంచి ఒక పద్యం చెప్పండి.
* కాకతీయుల గురించి మీకు ఎంత వరకు తెలుసు? (అభ్యర్థి వరంగల్ జిల్లాకు చెందినవారు)
* మొగల్స్ ఎవరెవరు? వారు చేసిన సంస్కరణల గురించి తెలపండి.
* ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి ఉరిశిక్షను రద్దు చేయవచ్చు? లేదా తగ్గించవచ్చు?
* సుప్రీంకోర్టు కంటే రాష్ట్రపతి ఎక్కువా? తక్కువా?
* వృత్తంలో ఒక చక్రధరం గీసి, ఎదురెదురు కోణాల మొత్తాన్ని ఎలా కనుక్కుంటారో వివరించండి.
* ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? దాని జనాభా, వైశాల్యం ఎంత?
అభ్యర్థుల సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు.
మూడో రోజు (జనవరి 30)
* ఆపరేషన్ - X అంటే ఏమిటి?
* ఆపరేషన్ బ్లూస్టార్ గురించి వివరించండి.
* బ్లాక్ హోల్ థియరీ గురించి తెలపండి.
* మయన్మార్ సమస్య గురించి వివరించండి.
* Electromagnetic Waves గురించి వివరించండి.
* అమెరికా, ఇండియా రాజ్యాంగాల మధ్య తేడా ఏమిటి?
* శ్రీలంక న్యాయస్థానం ఎదుర్కుంటున్న సమస్యలేవి?
* క్యూబా ఆర్థిక పరిస్థితుల గురించి వివరించండి.
* భారత్‌లో అణుశక్తిని పెంచుకోవడానికి గల మార్గాలను సూచించండి.
* ఇసుక తవ్వకం వల్ల లాభ, నష్టాలను వివరించండి.
* షారుక్ ఖాన్ ఉదంతం గురించి విశ్లేషించండి.
* అఫ్గానిస్థాన్‌లో గత 20 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాల గురించి తెలపండి.
* తేనెటీగల శాస్త్రీయనామం ఏమిటి?
* తెలుగు మహాసభల చిహ్నం ఏమిటి?
* కందిపప్పు క్వింటా ఎంత?
* ఉల్లిపాయలు క్వింటా ఎంత?
* బియ్యం క్వింటా ఎంత?
* ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు చేస్తోందా? వివరించండి.
* పెట్రోలు ధరలు పెరగడానికి కారణమేమిటి? వాటి పెరుగుదలపై మీ అభిప్రాయమేమిటి?
* ప్రభుత్వ పథకాల గురించి తెలపండి.
* విలీన డెవలప్‌మెంట్ అంటే ఏమిటి?
వీటితోపాటు వ్యక్తిగత, అభ్యర్థి జిల్లాకు సంబంధించిన సమాచారంపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
రెండో రోజు (జనవరి 29)
* బరాక్ ఒబామా రెండోసారి గెలవడానికి గల కారణాలను విశ్లేషించండి.
* చైనా, భారత్ సంబంధాల గురించి తెలపండి.
* తెలుగు మహాసభల గురించి వివరించండి.
* మహిళా సాధికారత గురించి తెలపండి.
* 'జ్యుడీషియల్ యాక్టివిజం' అంటే ఏమిటి?
* వైట్, గ్రీన్, ఎల్లో రివల్యూషన్ల మధ్య భేదాలను తెలపండి.
* భారత్‌లో FDI రిటేళ్లను అనుమతించవచ్చా? లేదా? వివరించండి.\
* లోక్‌పాల్, జన్‌లోక్‌పాల్ బిల్లుల మధ్య తేడాలను తెలపండి.
* కమ్యూనిజం, కమ్యూనలిజం మధ్య తేడా ఏమిటి? ఇండియాలో కమ్యూనలిజం పార్టీ ఏది?
* ఓసీలకు ఓబీసీ రిజర్వేషన్లను కల్పించిన మొదటి రాష్ట్రం ఏది?
* విద్యావ్యవస్థలోని సమస్యలను పరిష్కరించడానికి మీరిచ్చే సూచనలేమిటి?
* 'కంప్యూటర్ హ్యాకింగ్‌'ను ఎలా నియంత్రించవచ్చు?
* ఆముక్తమాల్యద రచయిత ఎవరు? విజయనగర సామ్రాజ్య స్థాపకులెవరు? (అభ్యర్థి విజయనగరం జిల్లాకు చెందినవారు)
* ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించండి. (అభ్యర్థి డీఎస్పీగా పనిచేస్తున్నారు)
* చేపల పులుసును ఎలా చేస్తారు? (అభ్యర్థిని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు)
* 'యయాతి చరిత్ర' గురించి తెలపండి. ఇది ఎవరి పాలనాకాలానికి సంబంధించింది?
* ఏపీపీఎస్సీలో రావాల్సిన సంస్కరణల గురించి తెలపండి.
* "Flux" అంటే ఏమిటి?
* "Electromagnetic Conduction" అంటే ఏమిటి?
* బిర్లాటెంపుల్ ప్రత్యేకత ఏమిటి?
మొదటి రోజు (జనవరి 28)
* 'బ్యూరోక్రసీ' అంటే ఏమిటి? లైన్, స్టాఫ్ మధ్య తేడా ఏమిటి?
* గవర్నమెంట్ సర్వెంట్‌కు, సివిల్ సర్వెంట్‌కు తేడా ఏమిటి?
* గ్రీన్‌హౌస్ వాయువులు, వాటి ఫలితాల గురించి చెప్పండి.
* తెలుగు మహాసభల గురించి చెప్పండి.
* మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరి మధ్య జరిగింది? దాని ప్రాముఖ్యత ఏమిటి?
* ఒక గ్రామంలోకి చిరుతపులి వచ్చింది. ఆర్‌డీవోగా నువ్వు ఏం చేస్తావు?
* 'పెద్దపులి' సంరక్షణను ఎందుకు చేపట్టాలి?
* అమెరికన్ బ్యూరోక్రసీ, ఇండియన్ బ్యూరోక్రసీ మధ్య తేడా ఏమిటి? ఈ రెండింటిలో ఏది విజయవంతమైంది? ఎందుకో వివరంగా చెప్పండి.
* నాయకుడి లక్షణాలు ఏమిటి? నాయకత్వ లక్షణాలు అంటే ఏమిటి?
* మీ పేరు, జిల్లా, విద్యార్హతలు ఏమిటి?
* రసాయనశాస్త్రంలో 'అవగాడ్రో సంఖ్య' అంటే ఏమిటి?
* మీ ఉపాధ్యాయ వృత్తిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి? నాయకత్వం ఎన్ని రకాలు?
* ఆర్‌డీవో విధులు ఏమిటి?
* ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి చెప్పండి. క్షేత్రస్థాయిలో వృథాను ఎలా అరికడతారు?
* భారత్, చైనా వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి? ఈ రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న పోలికలు ఏమిటి?
* మీ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది? దాని పాత పేరు ఏమిటి?
* ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏమిటి? వాటిలో మీకు ఏమి నచ్చాయి? ఎందుకు నచ్చాయి?
* న్యూటన్ గమన నియమాలు ఏమిటి? అవి ఎక్కడ ఉపయోగపడతాయి?
* 'క్లౌడ్ కంప్యూటింగ్' అంటే ఏమిటి?
* హెక్టారుకు ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఒక ఎకరానికి ఎన్ని గుంతలు ఉంటాయి?
* తుంగభద్ర నదికి ఆ పేరు ఎలా వచ్చింది?
* ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? వాటి పేర్లు ఏమిటి?
* ఒబామా, బుష్ మధ్య మీరు ఎలాంటి వైవిధ్యం చూశారు? వారిపై మీ అభిప్రాయం ఏమిటి?
* ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంక్షోభ నివారణకు మీరు ఎలాంటి చర్యలను సూచిస్తారు?
* పాకిస్థాన్ సమస్య గురించి చెప్పండి.
* మహిళల సమస్యల గురించి చెప్పండి.

No comments:

Post a Comment