వివన పబ్లికేషన్ ప్రచురించిన తెలంగాణ జిల్లాలు సమగ్ర సమాచారం అనే పుస్తకాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర సాగునీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీష్‌రావు మినిష్టర్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పడిన తరువాత వాటి సమగ్ర వివరాలతో సీనియర్ జర్నలిస్టు పి. నరసింహులు రచించిన ఈ పుస్తకాన్ని వివన పబ్లికేషన్స్ ప్రచురించడం జరిగింది. ప్రణాళిక శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ఆధారంగా తయారు చేయబడ్డ ఈ పుస్తకం రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు చక్కగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రచురణకర్తలను అభినందించారు. ఇటువంటి మరిన్ని పుస్తకాలను పోటీ పరీక్షల అభ్యర్థులకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు, వివన పబ్లికేషన్స్ తరఫున పి. నరసింహులు, కె. వెంకటేశ్, టి. సురేష్ బాబు, జె. రమేష్, పి. రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు.
Monday, January 30, 2017
తెలంగాణ జిల్లాలు సమగ్ర సమాచారం పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర సాగునీటిపారుదల మంత్రి తన్నీరు హరీష్‌రావు
వివన పబ్లికేషన్ ప్రచురించిన తెలంగాణ జిల్లాలు సమగ్ర సమాచారం అనే పుస్తకాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర సాగునీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీష్‌రావు మినిష్టర్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పడిన తరువాత వాటి సమగ్ర వివరాలతో సీనియర్ జర్నలిస్టు పి. నరసింహులు రచించిన ఈ పుస్తకాన్ని వివన పబ్లికేషన్స్ ప్రచురించడం జరిగింది. ప్రణాళిక శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ఆధారంగా తయారు చేయబడ్డ ఈ పుస్తకం రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు చక్కగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రచురణకర్తలను అభినందించారు. ఇటువంటి మరిన్ని పుస్తకాలను పోటీ పరీక్షల అభ్యర్థులకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు, వివన పబ్లికేషన్స్ తరఫున పి. నరసింహులు, కె. వెంకటేశ్, టి. సురేష్ బాబు, జె. రమేష్, పి. రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment