Monday, June 27, 2016

APPSC 18 గ్రూపు-2 ప్రీవియస్‌ పేపర్స్‌

గతాన్ని గుర్తుంచుకొని, భవిష్యత్‌కు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షల విషయంలో ఇది తప్పకుండా వర్తిస్తుంది. గతంలో జరిగిన పరీక్షలను బేరీజు వేసుకుని, రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావలసి ఉంటుంది. అలా కాకుండా, ముందుకు వెళితే ఏమీ సాధించలేము. భవిష్యత్‌లో జరగబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలంటే, అంతకు ముందు జరిగిన పరీక్షా పత్రాలను తప్పకుండా పరిశీలించవలసి ఉంటుంది. అప్పుడే వాటిపై ఒక అవగాహన ఏర్పడి, ఏ విధంగా ముందుకు సాగాలో అర్థమవుతోంది. అలా కాకుండా గుడ్డిగా వెళితే జరిగే నష్టం విలువను మనం లెక్కకట్టలేము. జరిగి పోయిన కాలం తిరిగి రాదు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే అరుదైన ఈ కాలంలో ప్రతి ఒక్క అంశాన్ని నిబద్ధతతో చదివి రాణించగిలినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేధించి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలుగుతాము. కాబట్టి, ఏ పోటీ పరీక్షకు సిద్ధపడే వారైనా ముందుగా గత ప్రశ్నా పత్రాలను తప్పనిసరిగా చదివి, సమీక్షించుకోవాలి. దాని వల్ల పరీక్షపై ఒక అవగాహన వస్తుంది. ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారో, వేటికి ఇవ్వలేదో అర్థమవుతుంది. కాబట్టి, రాబోయే పరీక్షలకు ప్రిపేర్‌ కావడం సులువు అవుతుంది. 

పై విషయాలను దృష్టిలో పెట్టుకునే గ్రూపు-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. 2008 నుండి 2012 వరకు జరిగిన మూడు గ్రూపు -2 పరీక్షల ప్రశ్నా పత్రాలతో పాటు 2012లో దాదాపు గ్రూపు-2 తరహాలో, గ్రూపు-2 సిలబస్‌తో నిర్వహించిన ఇతర గ్రూపు-2 స్థాయి పరీక్షలు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్‌ శాఖ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్లు ప్రశ్నా పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. 

ఈ పుస్తకంలో మొత్తం 18 గత పరీక్షా ప్రశ్నా పత్రాలను పొందుపరచడం జరిగింది. కాబట్టి, ఈ పుస్తకం మిమ్మలను రాబోయే గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధం చేయడంలో బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నాము. 

మా గత పుస్తకాలను ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ.....

విషయ సూచిక

పేపర్‌ -1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 5  -  76

గ్రూపు-2 - 2012 7 - 19

గ్రూపు-2 లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ -2012 20 - 29

ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్స్‌ - 2012 30 - 41

జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఇన్‌ ల్యాబ్స్‌ పంచాయతీరాజ్‌ - 2012 42 - 52

గ్రూపు -2 - 2011                            53 - 63

గ్రూపు - 2 - 2008                       64 - 75

పేపర్‌ -2 ఆంధ్రప్రదేశ్‌ సామాజిక - సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం - ఒక అవలోకనం 77 - 148

గ్రూపు - 2 - 2012                                                 
79 - 90

గ్రూపు-2 లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ -2012 91 - 103

ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్స్‌ - 2012 104 - 115

జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఇన్‌ ల్యాబ్స్‌ పంచాయతీరాజ్‌ - 2012 116 - 126

గ్రూపు -2 - 2011 127 - 137

గ్రూపు - 2 - 2008 138 - 148

పేపర్‌ -3 భారతదేశ ఆర్థిక వ్యవస్థ & ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ 149 - 229

గ్రూపు - 2 - 2012 151 - 165

గ్రూపు-2 లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ -2012 166 - 178

ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ జూనియర్‌ అసిస్టెంట్స్‌ - 2012 179 - 191

జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఇన్‌ ల్యాబ్స్‌ పంచాయతీరాజ్‌ - 2012 192 - 204

గ్రూపు -2 - 2011 205  - 216

గ్రూపు - 2 - 2008 217 - 229

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే 2015-16

రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం సామాజిక ఆర్థిక సర్వే నివేదికను రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు సమర్పించే రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని పరిణామాలను నిక్షిప్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను, పథకాలను, ఆర్థిక వృద్ధి వివరాలను పొందుపరచడం జరుగుతుంది. ఎపిపిఎస్‌సి నిర్వహించే గ్రూప్‌ -1, గ్రూప్‌ -2 పరీక్షలలో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్‌ -2 పేపర్‌ -3లో 40 నుండి 50 ప్రశ్నల వరకు సామాజిక ఆర్థిక సర్వే నుండి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ తాజా సమాచారాన్ని సామాజిక ఆర్థిక సర్వే అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం  పునర్వ్యవస్థీకరించబడి, రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన  గణాంకాలు, అంకెలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఈ పుస్తకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక వ్యవస్థ మొదలగు వాటి సమాచారాన్ని మీరు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  ఇందులో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో పాటు మారిన సరిహద్దులు, జనాభా లెక్కలు, పథకాల సమాచారం నిక్షిప్తం చేయడం జరిగింది.  ఈ పుస్తకం గ్రూప్‌-2 అభ్యర్థులతో పాటు  గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.  గత పుస్తకాల లాగే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...


మీ  పి. నరసింహులు
విషయ సూచిక

1. సాధారణ సమీక్ష 5  - 19

2. స్థూల ఆర్థిక సగటు విలువలు 20  - 29

3. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు 30  - 31

4. ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ 32  - 40

5. వ్యవసాయం & అనుబంధ రంగాలు 41  - 107

6. పరిశ్రమలు                                     108 -  126

7. మౌలిక వసతులు                  127  - 164

8. సామాజిక వసతులు              165  -  252

9. పేదరికం, ఉద్యోగిత & నిరుద్యోగిత 253  - 260

10. విజన్‌ సాధనకు వ్యూహాలు       261 - 271

పట్టికలు                            272  - 327


Friday, June 10, 2016

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సంస్కృతి
క్రీస్తుకు పూర్వం నుండి 2016 వరకు



రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొట్టమొదటి సారిగా ఎపిపిఎస్‌సి నిర్వహించబోతున్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ శుభాభివందనాలు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్‌ లేదు. ఇప్పుడే గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు జరుగబోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సిలబస్‌లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిధిలోకి వచ్చే ప్రాంతాల చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సంస్కృతి పుస్తకాన్ని  రూపొందించడం జరిగింది. మొత్తం 28 అధ్యాయాలుగా విభజించి, క్రీస్తుకు పూర్వం నుండి 2016 వరకు జరిగిన అన్ని ప్రధాన ఘట్టాలను, అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క అంశం కూడా తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధతో పుస్తకాన్ని  తయారు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ విభజించబడిన తరువాత అనేక కొత్త అంశాలకు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు అధికంగా ఉన్న అంశాలను తొలగించి, పరీక్షలకు ఉపయోగపడే వరకు మాత్రమే పొందుపరిచి, మీకు అందిస్తున్నాము. ప్రతి అధ్యాయానికి వీలైనన్ని ఎక్కువ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇవ్వడం ద్వారా మీ బుర్రకు పదును పెట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. 2008 నుండి 2012 వరకు జరిగిన గ్రూపు -2 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి నుండి వచ్చిన ప్రశ్నలను కూడా ఈ పుస్తకం చివరిలో మీ సౌలభ్యం కోసం ఇచ్చాము. ఈ పుస్తకం మీ విజయానికి ఎంతగానో సహకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.

మా గత పుస్తకాలను మాదిరిగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...
మీ
పి. నరసింహులు

విషయ సూచిక


ముఖ్యమై సంవత్సరాలు - ప్రధాన సంఘటనలు 7 - 22

1. ఆంధ్రుల చరిత్ర - ఆధారాలు 23 - 26

2. ఆంధ్ర - తెనుగు - తెలుగు పదాల చరిత్ర 27 - 28

3. మగధ, మౌర్య సామ్రాజ్యాలు - ఆంధ్రదేశము 29 - 30

4. శాతవాహన యుగం 31 - 41

5. శాతవాహనుల పరిపాలన, ఆర్థిక, సాంఘిక విషయాలు 42 - 70

6. ఇక్ష్వాకులు 71 -82

7. ప్రాచీన పల్లవులు 83 - 88

8. బృహత్పలయానులు 89 - 90

9. ఆనందగోత్రికులు 91 - 94

10. శాలంకాయనులు 95 - 99

11. విష్ణుకుండినులు 100 - 110

12. మహా మేఘవాహనులు, ఉత్తరాంధ్రను పాలించిన ఇతర రాజవంశాలు 111- 118

13. తూర్పు చాళుక్యులు 119 - 146

14. సామంత రాజవంశాలు 147 - 156

15. కాకతీయ సామ్రాజ్యం 157 - 180

16. రెడ్డి రాజులు 181 - 191

17. విజయనగర సామ్రాజ్యం 192 - 219

18. కుతుబ్‌ షాహీ యుగం 220 - 233

19. అసఫ్‌ జాహీ వంశ పాలన 234 - 246

20. ఆంధ్రదేశానికి ఐరోపా వర్తకుల రాక 247 - 268

21. ఆంధ్ర జాతీయోద్యమం 269 - 299

22. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ 300 - 320

23. 1956 తరువాత ముఖ్య ఘటనలు 321 - 340

24. వామపక్ష పార్టీలు - కమ్యూనిస్టులు - ఉద్యమాలు 341 - 344

25. సాంస్కృతిక పునరుజ్జీవనం 345 - 350

26. జమీందారి వ్యతిరేక రైతు ఉద్యమాలు 351 - 357

27. ప్రముఖ వ్యక్తులు - కవులు 358 - 377

28. ఇతర ముఖ్యాంశాలు 378 - 411

గ్రూపు -2 ప్రీవియస్‌ పేపర్స్‌ 412 - 428

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం - ముఖ్యాంశాలు 429 - 440