ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి
క్రీస్తుకు పూర్వం నుండి 2016 వరకు
రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొట్టమొదటి సారిగా ఎపిపిఎస్‌సి నిర్వహించబోతున్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ శుభాభివందనాలు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ లేదు. ఇప్పుడే గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు జరుగబోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సిలబస్‌లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిధిలోకి వచ్చే ప్రాంతాల చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. మొత్తం 28 అధ్యాయాలుగా విభజించి, క్రీస్తుకు పూర్వం నుండి 2016 వరకు జరిగిన అన్ని ప్రధాన ఘట్టాలను, అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క అంశం కూడా తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధతో పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజించబడిన తరువాత అనేక కొత్త అంశాలకు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు అధికంగా ఉన్న అంశాలను తొలగించి, పరీక్షలకు ఉపయోగపడే వరకు మాత్రమే పొందుపరిచి, మీకు అందిస్తున్నాము. ప్రతి అధ్యాయానికి వీలైనన్ని ఎక్కువ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వడం ద్వారా మీ బుర్రకు పదును పెట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. 2008 నుండి 2012 వరకు జరిగిన గ్రూపు -2 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి నుండి వచ్చిన ప్రశ్నలను కూడా ఈ పుస్తకం చివరిలో మీ సౌలభ్యం కోసం ఇచ్చాము. ఈ పుస్తకం మీ విజయానికి ఎంతగానో సహకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.
మా గత పుస్తకాలను మాదిరిగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...
మీ
పి. నరసింహులు
విషయ సూచిక
ముఖ్యమై సంవత్సరాలు - ప్రధాన సంఘటనలు 7 - 22
1. ఆంధ్రుల చరిత్ర - ఆధారాలు 23 - 26
2. ఆంధ్ర - తెనుగు - తెలుగు పదాల చరిత్ర 27 - 28
3. మగధ, మౌర్య సామ్రాజ్యాలు - ఆంధ్రదేశము 29 - 30
4. శాతవాహన యుగం 31 - 41
5. శాతవాహనుల పరిపాలన, ఆర్థిక, సాంఘిక విషయాలు 42 - 70
6. ఇక్ష్వాకులు 71 -82
7. ప్రాచీన పల్లవులు 83 - 88
8. బృహత్పలయానులు 89 - 90
9. ఆనందగోత్రికులు 91 - 94
10. శాలంకాయనులు 95 - 99
11. విష్ణుకుండినులు 100 - 110
12. మహా మేఘవాహనులు, ఉత్తరాంధ్రను పాలించిన ఇతర రాజవంశాలు 111- 118
13. తూర్పు చాళుక్యులు 119 - 146
14. సామంత రాజవంశాలు 147 - 156
15. కాకతీయ సామ్రాజ్యం 157 - 180
16. రెడ్డి రాజులు 181 - 191
17. విజయనగర సామ్రాజ్యం 192 - 219
18. కుతుబ్ షాహీ యుగం 220 - 233
19. అసఫ్ జాహీ వంశ పాలన 234 - 246
20. ఆంధ్రదేశానికి ఐరోపా వర్తకుల రాక 247 - 268
21. ఆంధ్ర జాతీయోద్యమం 269 - 299
22. ఆంధ్రప్రదేశ్ అవతరణ 300 - 320
23. 1956 తరువాత ముఖ్య ఘటనలు 321 - 340
24. వామపక్ష పార్టీలు - కమ్యూనిస్టులు - ఉద్యమాలు 341 - 344
25. సాంస్కృతిక పునరుజ్జీవనం 345 - 350
26. జమీందారి వ్యతిరేక రైతు ఉద్యమాలు 351 - 357
27. ప్రముఖ వ్యక్తులు - కవులు 358 - 377
28. ఇతర ముఖ్యాంశాలు 378 - 411
గ్రూపు -2 ప్రీవియస్ పేపర్స్ 412 - 428
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - ముఖ్యాంశాలు 429 - 440
Sir
ReplyDeleteAuthor name and cost..
Author D. Srinivas, Rate Rs. 297.
DeleteAuthor D. Srinivas, Rate Rs. 297.
DeleteHow and where
ReplyDeletei can buy sir
is it possible to purchase online your books please put in www.shopeyard.com economic surveys telugu also .. its not available in our city so please put in online
ReplyDelete