రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం సామాజిక ఆర్థిక సర్వే నివేదికను రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సమర్పించే రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని పరిణామాలను నిక్షిప్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను, పథకాలను, ఆర్థిక వృద్ధి వివరాలను పొందుపరచడం జరుగుతుంది. ఎపిపిఎస్‌సి నిర్వహించే గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్ -2 పేపర్ -3లో 40 నుండి 50 ప్రశ్నల వరకు సామాజిక ఆర్థిక సర్వే నుండి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ తాజా సమాచారాన్ని సామాజిక ఆర్థిక సర్వే అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం పునర్వ్యవస్థీకరించబడి, రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు, అంకెలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఈ పుస్తకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక వ్యవస్థ మొదలగు వాటి సమాచారాన్ని మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో పాటు మారిన సరిహద్దులు, జనాభా లెక్కలు, పథకాల సమాచారం నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ పుస్తకం గ్రూప్-2 అభ్యర్థులతో పాటు గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గత పుస్తకాల లాగే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...
మీ పి. నరసింహులు
విషయ సూచిక
1. సాధారణ సమీక్ష 5 - 19
2. స్థూల ఆర్థిక సగటు విలువలు 20 - 29
3. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు 30 - 31
4. ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ 32 - 40
5. వ్యవసాయం & అనుబంధ రంగాలు 41 - 107
6. పరిశ్రమలు 108 - 126
7. మౌలిక వసతులు 127 - 164
8. సామాజిక వసతులు 165 - 252
9. పేదరికం, ఉద్యోగిత & నిరుద్యోగిత 253 - 260
10. విజన్ సాధనకు వ్యూహాలు 261 - 271
పట్టికలు 272 - 327
మీ పి. నరసింహులు
విషయ సూచిక
1. సాధారణ సమీక్ష 5 - 19
2. స్థూల ఆర్థిక సగటు విలువలు 20 - 29
3. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు 30 - 31
4. ధరలు, వేతనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ 32 - 40
5. వ్యవసాయం & అనుబంధ రంగాలు 41 - 107
6. పరిశ్రమలు 108 - 126
7. మౌలిక వసతులు 127 - 164
8. సామాజిక వసతులు 165 - 252
9. పేదరికం, ఉద్యోగిత & నిరుద్యోగిత 253 - 260
10. విజన్ సాధనకు వ్యూహాలు 261 - 271
పట్టికలు 272 - 327
No comments:
Post a Comment